News November 17, 2024

అవకతవకలు జరుగుతున్నాయ్: కైలాష్ గహ్లోత్

image

ఆతిశీ ప్ర‌భుత్వంలో అవ‌క‌త‌వ‌క‌లు జ‌రుగుతున్నాయ‌ని ఆప్‌కు <<14635089>>రాజీనామా<<>> చేసిన కైలాష్ గ‌హ్లోత్‌ ఆరోపించారు. పార్టీ స‌వాళ్లు ఎదుర్కొంటోంద‌ని, ప్ర‌జ‌ల‌కు ఇచ్చిన హామీల‌ను విస్మ‌రించింద‌ని పేర్కొన్నారు. ప్ర‌జ‌లపై పార్టీ నిబ‌ద్ధ‌త‌ను వ్యక్తిగత రాజ‌కీయ ఆశయాలు అధిగ‌మించాయ‌న్నారు. అధికారిక నివాసానికి భారీగా ఖర్చు చేయడం వంటి అంశాలు సామాన్యులుగా ఉండాల‌నుకొనే పార్టీ వైఖ‌రిపై అనుమానాల‌కు తావిస్తోంద‌ని తప్పుబట్టారు.

Similar News

News January 30, 2026

బంగారం డిమాండ్ తగ్గుతోంది: WGC

image

బంగారం ధర ఎఫెక్ట్ డిమాండ్‌పై పడింది. వివాహాల సీజన్ అయినా కొనుగోళ్లు పెరగకపోవడమే ఇందుకు ఉదాహరణ. గతేడాదితో పోలిస్తే ఈసారి డిమాండ్ తక్కువేనని వరల్డ్ గోల్డ్ కౌన్సిల్ పేర్కొంది. 2024లో 802.8 టన్నుల అమ్మకాలు జరగ్గా 2025లో 11% తగ్గి 710.9 టన్నులకు చేరింది. ఈ ఏడాది అది 600-700 టన్నులే ఉండొచ్చని WGC అంచనా వేసింది. 2024లో కొనుగోళ్ల విలువ రూ.5.75లక్షల కోట్లు కాగా 2025లో అది రూ.7.51లక్షల కోట్లకు చేరింది.

News January 30, 2026

ఈ హైబ్రిడ్ కొబ్బరి రకాలతో అధిక ఆదాయం

image

☛ వైనతేయ గంగ: నాటిన 3-4 ఏళ్లలో కాపునకు వస్తుంది. ఏటా చెట్టుకు 125 కాయల దిగుబడి వస్తుంది. కొబ్బరిలో నూనె దిగుబడి 69 శాతం.
☛ వశిష్ట గంగ: నాటిన 3-4 ఏళ్లలో కాపునకు వస్తుంది. సగటున చెట్టుకు 125 కాయల దిగుబడి వస్తుంది. కొబ్బరిలో నూనె దిగుబడి 69 శాతం.
☛ అభయ గంగ: నాటిన 4 ఏళ్లకు కాపునకు వస్తుంది. సగటున చెట్టుకు 135 కాయల దిగుబడి వస్తుంది. కొబ్బరిలో నూనె దిగుబడి 72 శాతం. కొబ్బరి నూనెకు ఇది అనుకూలం.

News January 30, 2026

DRDOలో జూనియర్ రీసెర్చ్ ఫెలో పోస్టులు

image

విశాఖపట్నంలోని DRDOకు చెందిన నావల్ సైన్స్& టెక్నలాజికల్ లాబోరేటరీ (<>NSTL<<>>) 7 జూనియర్ రీసెర్చ్ ఫెలో(JRF)పోస్టులను భర్తీ చేయనుంది. అర్హత గలవారు ఫిబ్రవరి 26న ఇంటర్వ్యూకు హాజరుకావచ్చు. సంబంధిత విభాగంలో BE/B.Tech, NET/GATE లేదా ME/MTech ఉత్తీర్ణులు అర్హులు. అభ్యర్థుల గరిష్ఠ వయసు 28 ఏళ్లు. నెలకు రూ.37,000+HRA చెల్లిస్తారు. వెబ్‌సైట్: https://www.drdo.gov.in/