News November 18, 2024
మణిపుర్ మంటలు: మరోసారి అమిత్ షా హైలెవల్ మీటింగ్

మణిపుర్‌లో పరిస్థితులపై కేంద్ర హోంమంత్రి అమిత్ షా సోమవారం హై లెవల్ మీటింగ్ నిర్వహించారని తెలిసింది. ఆదివారం సైతం ఝార్ఖండ్‌లో ఎన్నికల ప్రచారాన్ని మధ్యలోనే వదిలేసి ఆయన సమీక్షించడం గమనార్హం. మైతేయ్ ప్రజలపై కుకీ మిలిటెంట్లు దాడులు చేయడంతో రాష్ట్రంలో మళ్లీ హింస చెలరేగింది. దీంతో కేంద్రం అదనంగా 50 కంపెనీల సాయుధ బలగాలను అక్కడికి తరలించింది. ఇప్పటికే మోహరించిన వాటితో కలిపి ఈ సంఖ్య 70కి చేరింది.
Similar News
News November 11, 2025
2700 పోస్టులు.. నేటి నుంచి దరఖాస్తులు

బ్యాంక్ ఆఫ్ బరోడా(BOB) 2,700 అప్రెంటిస్ పోస్టులకు నేటి నుంచి దరఖాస్తులు కోరుతోంది. డిగ్రీ ఉత్తీర్ణులైనవారు DEC 1వరకు అప్లై చేసుకోవచ్చు. మొత్తం అప్రెంటిస్‌లలో TGలో 154, APలో 38 ఉన్నాయి. NATS లేదా NAPS పోర్టల్ ద్వారా రిజిస్ట్రేషన్ చేసుకోవాలి. ఆన్‌లైన్ ఎగ్జామ్, డాక్యుమెంట్ వెరిఫికేషన్, లోకల్ లాంగ్వేజ్ టెస్ట్ ద్వారా ఎంపిక చేస్తారు. మరిన్ని ఉద్యోగ నోటిఫికేషన్ల కోసం <<-se_10012>>జాబ్స్<<>> కేటగిరీకి వెళ్లండి.
News November 11, 2025
కర్రపెండలంలో జింక్ లోప లక్షణాలు – నివారణ

కర్రపెండలంలో మొక్కలో జింక్ లోపం వల్ల ఆకులు సన్నగా, పసుపుగా మారి పైకి వంకరగా ఉంటాయి. పెరుగుతున్న లేత మొక్క భాగంపై ప్రభావం ఎక్కువగా ఉండి, పెరుగుదల తగ్గుతుంది. లేత ఆకులలో ఈనెల ముఖ్య భాగం పసుపు రంగులోకి మారుతుంది. లోప నివారణకు 5KGల జింక్ సల్ఫేట్ భూమిలో వేసి కప్పాలి. 1-2% జింక్ సల్ఫేట్ ద్రావణాన్ని 3-4 సార్లు పిచికారీ చేయాలి. ముచ్చెలను 2-4% జింక్ సల్ఫేట్ ద్రావణంలో 15 నిమిషాలు ముంచిన తర్వాత నాటుకోవాలి.
News November 11, 2025
బ్యాంక్ ఆఫ్ బరోడాలో ఉద్యోగాలు

బ్యాంక్ ఆఫ్ బరోడా(<


