News September 21, 2024

మణిపుర్: పోలీసులకు దొరికిన రాకెట్ హెడ్స్, షెల్స్, మోర్టార్లు

image

మణిపుర్‌లో పోలీసుల సోదాల్లో అధునాతన ఆయుధాలు, పేలుడు సామగ్రి దొరకడం కలకలం రేపుతోంది. చురాచాంద్‌పుర్ జిల్లాలోని సములామ్లన్‌లో పోలీసులు శుక్రవారం సెర్చ్ ఆపరేషన్ చేపట్టారు. ఇంప్రూవైజ్డ్ రాకెట్ షెల్, వేర్వేరు సైజుల్లో 3 లైవ్ రాకెట్ హెడ్ అమ్యూనిషన్, 3 ఇంప్రూవైజ్డ్ మోర్టార్లు, యాంటీ రియోట్ స్టన్ షెల్స్, స్టన్ గ్రెనేడ్ స్వాధీనం చేసుకున్నారు. మయన్మార్ నుంచి 900 <<14154680>>కుకీ మిలిటెంట్ల<<>> చొరబాటు గురించి తెలిసిందే.

Similar News

News September 21, 2024

సీఎం చంద్రబాబుకు కృతజ్ఞతలు: జూ.ఎన్టీఆర్

image

ఏపీ సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, మంత్రి కందుల దుర్గేశ్‌కు సినీ హీరో Jr.NTR కృతజ్ఞతలు తెలిపారు. ‘దేవర’ సినిమా టికెట్ల ధర పెంపునకు అనుమతినిస్తూ జీవో జారీ చేసినందుకు ధన్యవాదాలు తెలిపారు. తెలుగు సినిమాకు మద్దతిస్తున్నందుకు కృతజ్ఞతలు అంటూ ట్వీట్ చేశారు.

News September 21, 2024

యువీ ఆ రోజు ఏడు సిక్సులు కొట్టి ఉండేవారు: బ్రాడ్

image

2007 టీ20 వరల్డ్ కప్‌లో ఇంగ్లండ్ బౌలర్ స్టువర్ట్ బ్రాడ్‌ ఓవర్లో యువరాజ్ సింగ్ 6 సిక్సులు కొట్టిన సంగతి తెలిసిందే. ఆ రోజు అంపైర్ కారణంగా యువీ ఏడో సిక్స్ మిస్ అయిందని బ్రాడ్ ఓ ఇంటర్వ్యూలో తెలిపారు. ‘ఆ ఓవర్ రీప్లే నేను మళ్లీ ఎప్పుడూ చూడలేదు. కానీ ఒక్క విషయం ఒప్పుకోవాలి. అంపైర్ చూడకపోవడం వల్ల ఆ ఓవర్లో ఓ నోబాల్ వేసినా తప్పించుకున్నాను. లేదంటే యూవీ 7 సిక్సులు కొట్టేసి ఉండేవారు’ అని వ్యాఖ్యానించారు.

News September 21, 2024

ఏచూరి స్ఫూర్తితో జమిలి ఎన్నికలపై పోరాడాలి: సీఎం రేవంత్

image

TG: సీతారాం ఏచూరిని కోల్పోవడం సమాజానికి తీరని నష్టం అని సీఎం రేవంత్ అన్నారు. HYDలో జరిగిన ఏచూరి సంస్మరణ సభలో మాట్లాడుతూ ‘జమిలి ఎన్నికల ముసుగులో కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ కుట్ర చేస్తోంది. దేశాన్ని కబళించాలని చూస్తోంది. సీతారాం ఏచూరి స్ఫూర్తితో జమిలి ఎన్నికల అంశంపై పోరాడాలి. ఈ సమయంలో ఆయన లేకపోవడం దేశానికి నష్టం’ అని వ్యాఖ్యానించారు.