News September 6, 2024
మణిపుర్: మొన్న డ్రోన్.. నేడు రాకెట్ బాంబులతో దాడి

మణిపుర్లోని బిష్ణుపుర్ జిల్లాలో మిలిటెంట్లు ఉదయం బాంబులతో దాడి చేశారు. పక్కనే ఎత్తుమీదున్న చురాచంద్పుర్ జిల్లాలోని కొండప్రాంతం నుంచి జనావాసమైన ట్రాంగ్లావోబీ లక్ష్యంగా రాకెట్లు ప్రయోగించారు. అవి కనీసం 3 కి.మీ దాటొచ్చాయని పోలీసులు పేర్కొన్నారు. ఈ ఘటనలో ప్రాణ నష్టమేమీ జరగలేదని, కమ్యూనిటీ హాల్, ఖాళీ గది ధ్వంసమయ్యాయని తెలిపారు. ఇప్పటికే ఇంఫాల్లో డ్రోన్ బాంబు దాడులు జరుగుతున్న సంగతి తెలిసిందే.
Similar News
News November 5, 2025
రేపు ఈ జిల్లాల్లో వర్షాలు: APSDMA

AP: నైరుతి బంగాళాఖాతం నుంచి ఉ.కేరళ వరకు తమిళనాడు మీదుగా ద్రోణి కొనసాగుతుందని రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ MD ప్రఖర్ జైన్ తెలిపారు. రేపు కృష్ణా, ప్రకాశం, నెల్లూరు, అనంతపురం, శ్రీసత్యసాయి, కడప, అన్నమయ్య, చిత్తూరు, తిరుపతి జిల్లాల్లో అక్కడక్కడ పిడుగులతో కూడిన తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు పడతాయని పేర్కొన్నారు. మిగతా జిల్లాల్లో అక్కడక్కడ పిడుగులతో కూడిన తేలికపాటి వర్షాలు కురిసే అవకాశముందన్నారు.
News November 5, 2025
రెండు రోజులు జూ.పంచాయతీ కార్యదర్శుల సర్టిఫికెట్ వెరిఫికేషన్

TG: జూ.పంచాయతీ కార్యదర్శుల ఎంపికలో భాగంగా 2 రోజులపాటు సర్టిఫికెట్ల వెరిఫికేషన్ చేయనున్నట్లు పంచాయతీ రాజ్ శాఖ వెల్లడించింది. 2019లో కోర్టు వివాదాల నేపథ్యంలో స్పోర్ట్స్ కోటాలో ఎంపికైన కార్యదర్శులను తొలగించిన విషయం తెలిసిందే. ఇప్పుడు వారితో పాటు కొత్తగా ఎంపికైన 172 మంది ధ్రువపత్రాలను ఈ నెల 10, 11 తేదీల్లో ఉ.10.30 గంటల నుంచి సా.5 గంటల వరకు పరిశీలించనున్నట్లు తెలిపింది.
News November 5, 2025
పంట నష్టం నమోదు గడువు పొడిగించాం: అచ్చెన్న

AP: రాష్ట్రంలో మొంథా తుఫాన్ వల్ల నష్టపోయిన పంటల నమోదుకు గడువును మరో 2 రోజులు పొడిగించినట్లు వ్యవసాయ మంత్రి అచ్చెన్నాయుడు తెలిపారు. తుఫానుతో నష్టపోయిన ప్రతి రైతుకు పరిహారం అందిస్తామని చెప్పారు. రాష్ట్రంలో ఈ-క్రాప్ నమోదు వంద శాతం జరిగిందని పేర్కొన్నారు. దీనిపై జగన్ అబద్ధాలు చెబుతున్నారని, ఆయన వస్తే ఈ-క్రాప్ నమోదు అయిందో లేదో చూపిస్తానని సవాల్ చేశారు.


