News April 11, 2025
‘లులు’ చేతికి మంజీరా

HYD కూకట్పల్లిలోని మంజీరా మాల్ను లులు ఇంటర్నేషనల్ సంస్థ సొంతం చేసుకుంది. మంజీరాపై 49 సంస్థలు ఆసక్తి చూపగా చివరికి 7 మాత్రమే పోటీలో నిలిచాయి. దివాలా పరిష్కార ప్రక్రియ ద్వారా రూ.318 కోట్లకు లులు కొనుగోలు చేసింది. మంజీరా మాల్ నిర్మాణానికి చేసిన అప్పులు చెల్లించలేక పారిశ్రామికవేత్త యోగానంద్ 2023లో దివాలా పిటిషన్ దాఖలు చేసిన విషయం తెలిసిందే. ప్రస్తుతం ఈ మంజీరాలోనే లులు మాల్ అద్దెకు ఉంటోంది.
Similar News
News December 28, 2025
ఈనెల 29న బాపట్ల కలెక్టరేట్లో PGRS

బాపట్ల జిల్లా కలెక్టరేట్లో ఈనెల 29న జరిగే PGRSకు అన్ని శాఖల జిల్లా అధికారులు హాజరుకావాలని కలెక్టర్ డాక్టర్ వినోద్ కుమార్ అన్నారు. ఉదయం 9 నుంచి 10 వరకు జిల్లా స్థాయి అధికారులతో సమీక్షా సమావేశం ఉంటుందన్నారు. 10 నుంచి మధ్యాహ్నం ఒంటిగంట వరకు ప్రజల నుంచి అర్జీలు స్వీకరించడం జరుగుతుందన్నారు. కలెక్టరేట్తోపాటు ప్రతి రెవిన్యూ డివిజన్లోనూ, తహశీల్దార్ కార్యాలయాలలోనూ అర్జీలస్వీకరణ ఉంటుందన్నారు.
News December 28, 2025
2 రోజుల్లో ముగిసిన టెస్టు.. రూ.60 కోట్ల నష్టం?

యాషెస్ సిరీస్ క్రికెట్ ఆస్ట్రేలియాకు నష్టాలను తెచ్చిపెడుతోంది. మెల్బోర్న్ వేదికగా ఇంగ్లండ్తో జరిగిన నాలుగో టెస్టు రెండు రోజుల్లో <<18683393>>ముగియడమే<<>> దీనికి కారణమని అంతర్జాతీయ మీడియా తెలిపింది. దీంతో భారీగా బిజినెస్ కోల్పోయి, దాదాపు రూ.60 కోట్ల నష్టం వచ్చిందని పేర్కొంది. అంతకుముందు రెండో టెస్టు(పెర్త్) సైతం 2 రోజుల్లోనే ముగిసిన సంగతి తెలిసిందే. చివరి టెస్టు సిడ్నీ వేదికగా JAN 4న మొదలు కానుంది.
News December 28, 2025
నేటి ముఖ్యాంశాలు

✫ AP: టెక్నాలజీ విషయంలో భువనేశ్వరి నాకంటే ముందున్నారు: చంద్రబాబు
✫ శాంతిభద్రతలకు విఘాతం కలిగిస్తే ఎవరినీ వదిలిపెట్టం: అనిత
✫ మానవ హక్కులను కాలరాస్తున్న కూటమి ప్రభుత్వం: వైసీపీ
✫ TG: మహాత్ముడి పేరుతో వచ్చిన పథకాన్ని కాపాడుకోవాలి: రేవంత్
✫ ఏప్రిల్ నుంచి రెండో విడత ఇందిరమ్మ ఇళ్లు: పొంగులేటి
✫ జనవరి 5 నుంచి MGRNEGA బచావో అభియాన్: కాంగ్రెస్
✫ యాషెస్: నాలుగో టెస్టులో విజయం సాధించిన ఇంగ్లండ్


