News July 8, 2025
‘మంజుమ్మల్ బాయ్స్’ ఫేమ్ సౌబిన్ అరెస్ట్

‘మంజుమ్మల్ బాయ్స్’ ఫేమ్ సౌబిన్ షాహిర్‌ను పోలీసులు అరెస్ట్ చేశారు. అతడి తండ్రి బాబు షాహిర్, నిర్మాత షాన్ ఆంటోనీలను కూడా అదుపులోకి తీసుకున్నారు. ఆ వెంటనే వారు స్టేషన్ బెయిల్‌పై విడుదలయ్యారు. ‘మంజుమ్మల్ బాయ్స్’ ఆర్థిక మోసం కేసులో వీరిని అరెస్ట్ చేశారు. ఆ మూవీ కోసం తన నుంచి సౌబిన్, ఆంటోనీలు రూ.7 కోట్ల అప్పు తీసుకుని ఎగ్గొట్టినట్లు ఇన్వెస్టర్ సిరాజ్ వలియతుర పోలీసులకు ఫిర్యాదు చేశారు.
Similar News
News July 9, 2025
పాత వాహనాలకు నవంబర్ 1 వరకే ఛాన్స్

పాత వాహనాలకు ఫ్యూయెల్ బ్యాన్‌ను ఢిల్లీ ప్రభుత్వం తాత్కాలికంగా వెనక్కి తీసుకున్న విషయం తెలిసిందే. ఈ ఛాన్స్ నవంబర్ 1 వరకేనని తాజాగా వెల్లడించింది. ఆటోమేటెడ్ నంబర్ ప్లేట్ రికగ్నిషన్ సిస్టంలో సమస్యలే ఇందుకు కారణమంది. కాగా పదేళ్లు దాటిన డీజిల్, 15ఏళ్లు పైబడిన పెట్రోల్ వాహనాలకు ఫ్యూయెల్ బ్యాన్ చేస్తూ ఇటీవల నిర్ణయం తీసుకున్నారు. ఢిల్లీతో పాటు సమీప 5 ప్రాంతాల్లో NOV 1 నుంచి ఈ బ్యాన్ అమల్లోకి రానుంది.
News July 9, 2025
ధైర్యం లేనప్పుడు సవాల్ విసరడం ఎందుకు?: KTR

TG: చర్చకు వచ్చే ధైర్యం లేనప్పుడు సవాల్ విసరడం ఎందుకని సీఎం రేవంత్ రెడ్డిని మాజీ మంత్రి కేటీఆర్ ప్రశ్నించారు. ‘రైతు సంక్షేమంపై బహిరంగ చర్చకు రావాలని ఆయనే సవాల్ విసిరారు. నేను దాన్ని స్వీకరించి, 72 గంటల నోటీస్ ఇచ్చా. ఇవాళ అందరి సమక్షంలో గంటపాటు వేచి చూసినా ఆయన రాలేదు. ఇంతమాత్రం దానికి సవాల్ విసరడం ఎందుకు రేవంత్ రెడ్డి?’ అని ట్వీట్ చేశారు. దీనికి ‘కాంగ్రెస్ ఫెయిల్డ్ తెలంగాణ’ హ్యాష్ ట్యాగ్ ఇచ్చారు.
News July 9, 2025
ఇక సెలవు.. శివశక్తి దత్తా అంత్యక్రియలు పూర్తి

ప్రముఖ సంగీత దర్శకుడు కీరవాణి తండ్రి శివశక్తి దత్తా(92) అంత్యక్రియలు పూర్తి అయ్యాయి. మంగళవారం సాయంత్రం హైదరాబాద్ ఫిల్మ్‌నగర్‌లోని మహాప్రస్థానంలో అంతిమ సంస్కారాలు నిర్వహించారు. కుటుంబ సభ్యులు ఆయనకు కన్నీటి వీడ్కోలు పలికారు. <<16987487>>శివశక్తి దత్తా<<>> వృద్ధాప్య సమస్యలతో బాధపడుతూ సోమవారం రాత్రి తుదిశ్వాస విడిచిన విషయం తెలిసిందే.