News April 11, 2024
‘మంజుమ్మల్ బాయ్స్’ చిత్ర ప్రదర్శన నిలిపివేత!

మలయాళ చిత్రం ‘మంజుమ్మల్ బాయ్స్’ చిత్రాన్ని తెలుగులో రిలీజ్ చేయగా.. PVRINOX ప్రదర్శనకు నిరాకరించింది. దీంతో సినీ ప్రేమికులు PVRINOXపై ఫైరవుతున్నారు. అయితే, దీనికొక కారణముంది. కేరళ ఫిల్మ్ ప్రొడ్యూసర్స్ అసోసియేషన్ ఇటీవల PDC అనే కంపెనీని ప్రారంభించింది. థియేటర్స్ దీని నుంచి డిజిటల్ ప్రింట్స్ కొనాలని తెలిపింది. దీనికి PVRINOX నిరాకరించింది. దీంతో మలయాళ డబ్బింగ్ సినిమాల ప్రదర్శనకు సైతం ఒప్పుకోవట్లేదు.
Similar News
News December 2, 2025
ఈ సారి చలి ఎక్కువే: IMD

దేశంలో ఈ శీతాకాలంలో చలి తీవ్రత ఎక్కువగా ఉండే అవకాశం ఉందని IMD హెచ్చరించింది. మధ్య, వాయవ్య, ఈశాన్య భారతంలోని కొన్ని ప్రాంతాల్లో చలిగాలులు ఎక్కువగా వీస్తాయని అంచనా వేసింది. హరియాణా, రాజస్థాన్, ఢిల్లీ, గుజరాత్ తదితర రాష్ట్రాల్లో సాధారణం కంటే తక్కువగా ఉష్ణోగ్రతలు నమోదవుతాయని పేర్కొంది. ఆయా రాష్ట్రాల్లో 4-5 రోజులు ఎక్కువగా కోల్డ్ వేవ్స్ ఉంటాయని చెప్పింది. కాగా దేశంలో ఇప్పటికే చలి పెరిగిపోయింది.
News December 2, 2025
ఐఐసీటీ హైదరాబాద్‌లో ఉద్యోగాలు

హైదరాబాద్‌లోని CSIR-<
News December 2, 2025
దూడలకు వ్యాధినిరోధక టీకాలు ఎప్పుడు వేయించాలి?

☛ 6 నుంచి 8 వారాల వయసులో తొలిసారి గాలికుంటు వ్యాధి టీకా వేయించాలి. తర్వాత 3 నెలల్లో బూస్టర్ డోస్ ఇవ్వాలి.
☛ 4 నెలల వయసులో(ముఖ్యంగా సంకర జాతి దూడలకు) థైలీరియాసిస్ టీకా వేయించాలి.
☛ 6 నెలల వయసు దాటాక గొంతువాపు వ్యాధి రాకుండా టీకా వేయించాలి. ☛ 6- 12 నెలల వయసులో గొంతువాపు వ్యాధి టీకా వేయించిన 15-20 రోజుల తర్వాత జబ్బవాపు రాకుండా టీకా వేయించాలంటున్నారు వెటర్నరీ నిపుణులు.


