News May 4, 2024

ఇవాళ అర్ధరాత్రి OTTలోకి ‘మంజుమ్మల్ బాయ్స్’

image

మలయాళ బ్లాక్‌బస్టర్ మూవీ ‘మంజుమ్మల్ బాయ్స్’ ఇవాళ అర్ధరాత్రి నుంచి OTTలో స్ట్రీమింగ్ కానుంది. తెలుగుతో పాటు తమిళ, కన్నడ, హిందీ, మలయాళం భాషల్లో స్ట్రీమింగ్ చేస్తున్నట్లు డిస్నీ+హాట్‌స్టార్ ప్రకటించింది. ఈ చిత్రం తెలుగులోనూ పాజిటివ్ టాక్‌తో మంచి వసూళ్లు రాబట్టింది. దీనికి చిదంబరం దర్శకత్వం వహించారు. ఓ గుహలో చిక్కుకున్న ఫ్రెండ్‌ను కాపాడేందుకు తోటి మిత్రులు చేసే పోరాటం ఆధారంగా ఈ సినిమా తెరకెక్కింది.

Similar News

News April 7, 2026

రేపు రాష్ట్ర వ్యాప్తంగా వర్షాలు: APSDMA

image

AP: TG, రాయలసీమ, TN ప్రాంతాలపై ఉన్న ఉపరితల ఆవర్తనం మీదుగా మన్నార్ వరకు ద్రోణి విస్తరించి ఉందని APSDMA తెలిపింది. దీంతో రేపు SKLM, VZM, మన్యం, అల్లూరి, పోలవరం, విశాఖ, అనకాపల్లి, కాకినాడ, కోనసీమ, తూ.గో., ప.గో., ఏలూరు, కృష్ణా, NTR, గుంటూరు జిల్లాల్లోని కొన్నిప్రాంతాల్లో పిడుగులతో కూడిన మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని వెల్లడించింది. మిగతా జిల్లాల్లోనూ తేలికపాటి వానలు పడే ఛాన్స్ ఉందని చెప్పింది.

News April 7, 2026

బ్యారెల్ $150 దాటితే భారత్‌కు దెబ్బే: మోర్గాన్ స్టాన్లీ రిపోర్ట్

image

క్రూడ్ ఆయిల్ బ్యారెల్ ధర $150 దాటి ఓ త్రైమాసికం పాటు కొనసాగితే అది భారత్ GDP గ్రోత్‌పై ప్రభావం చూపిస్తుందని మోర్గాన్ స్టాన్లీ రిపోర్ట్ వెల్లడించింది. FY27లో గ్రోత్ రేట్ 5.7%కు పరిమితమవుతుందని.. కొవిడ్ తర్వాత నమోదైన అత్యల్ప గ్రోత్ ఇదే అవుతుందని తెలిపింది. అలాగే GDP అంచనాను 6.5% నుంచి 6.2%కు తగ్గించింది. కాగా ప్రస్తుతం బ్రెంట్ బ్యారెల్ $110, WTI క్రూడ్ $114 వద్ద ట్రేడవుతున్నాయి.

News April 7, 2026

పోలీసుల అరాచకాన్ని చీల్చిచెండాడిన ధీరవనిత!

image

తమిళనాడు లాకప్ డెత్ <<19584048>>కేసులో<<>> హెడ్ కానిస్టేబుల్ రేవతి సాక్ష్యం వెన్నెముకగా నిలిచింది. తోటి పోలీసుల ఒత్తిడిని, బెదిరింపులను ఎదిరించి ఆమె మేజిస్ట్రేట్ ముందు నిజం చెప్పారు. ‘తండ్రీకొడుకులను రక్తం వచ్చేలా రాత్రంతా కొట్టారు’ అని ఆమె ఇచ్చిన వాంగ్మూలం శిక్ష పడడంలో ప్రధాన పాత్ర పోషించింది. వ్యవస్థలోని అరాచకానికి వ్యతిరేకంగా పోరాడిన రేవతి ధైర్యం ఎంతో గొప్పదని, రియల్ హీరో అంటూ నెటిజన్లు ప్రశంసిస్తున్నారు.