News December 27, 2024
మన్మోహన్ ఫ్యామిలీ వివరాలు
మన్మోహన్ 1958లో గుర్శరన్ కౌర్‌ను వివాహం చేసుకున్నారు. ఈమె ప్రొఫెసర్, రచయిత. వీరికి ముగ్గురు కూతుళ్లు ఉపీందర్, దమన్, అమృత్ సింగ్ ఉన్నారు. ఉపీందర్ అకోలా వర్సిటీ డీన్, హిస్టరీ ప్రొఫెసర్, ఢిల్లీ వర్సిటీలో హిస్టరీ HODగా పనిచేశారు. ఈమె 6 పుస్తకాలు రాశారు. దమన్ అనేక నవలలు రాశారు. NATGRID సీఈవోగా పనిచేశారు. అమృత్ ACLUలో స్టాఫ్ అటార్నీగా సేవలందిస్తున్నారు. మన్మోహన్ అల్లుళ్లు ఉన్నతస్థానాల్లో ఉన్నారు.
Similar News
News December 27, 2024
YCPకి ఇంతియాజ్ రాజీనామా
AP: కర్నూలు జిల్లాలో వైసీపీకి షాక్ తగిలింది. విశ్రాంత IAS అధికారి ఇంతియాజ్ అహ్మద్ వైసీపీకి రాజీనామా చేశారు. గత ఎన్నికల్లో కర్నూలు అసెంబ్లీ నుంచి వైసీపీ అభ్యర్థిగా పోటీ చేసిన ఆయన టీజీ భరత్ చేతిలో ఓడిపోయారు. అప్పటి నుంచి వైసీపీకి దూరంగా ఉంటున్న ఆయన తాజాగా రాజకీయాల నుంచి తప్పుకుంటున్నట్లు వెల్లడించారు. ఇకపై సామాజిక కార్యక్రమాల్లో పాల్గొంటానని ఆయన ఓ ప్రకటన విడుదల చేశారు.
News December 27, 2024
RARE PHOTO: తొలి డాక్టరమ్మలు!
పైనున్న ఫొటోలో కనిపిస్తున్న ముగ్గురు మహిళలెవరని ఆలోచిస్తున్నారా? ఈ ముగ్గురూ వైద్యులుగా లైసెన్స్ పొందిన తొలి మహిళలు. 1885లో తీసిన ఈ ఫొటోలో ఓ భారతీయురాలు కూడా ఉండటం విశేషం. ఆమె పేరు ఆనందీబాయి జోషి(చీరలో ఉన్నారు). మరో ఇద్దరు జపాన్‌కు చెందిన కెయి ఒకామి, సిరియా నుంచి సబాత్ ఇస్లాంబూలీ. కాగా, ఆనందీబాయి 1886లో వైద్య విద్యలో పట్టా పొందారు.
News December 27, 2024
రేపు ఒకపూట సెలవు
మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ మృతికి సంతాపంగా కేంద్ర క్యాబినెట్ కీలక నిర్ణయం తీసుకుంది. శనివారం ఒకపూట సెలవు ఇస్తున్నట్లు ప్రకటించింది. దేశంలోని కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు, కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థలకు ఈ సెలవు వర్తించనుంది. ఇప్పటికే 7 రోజుల పాటు సంతాప దినాలను కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది. కాగా తెలంగాణ, కర్ణాటక ప్రభుత్వాలు ఇవాళ సెలవు ప్రకటించిన సంగతి తెలిసిందే.