News December 30, 2024

మన్మోహన్ ఎందరికో మార్గదర్శి: రేవంత్

image

TG: దేశ నిర్మాణం కోసం మన్మోహన్ సింగ్ ఎన్నో నిర్మాణాత్మక సంస్కరణలు ప్రవేశపెట్టారని సీఎం రేవంత్ వెల్లడించారు. ఉపాధి హామీ, RTI, NRHM, ఆధార్‌ను ఆయన ప్రారంభించారని తెలిపారు. 2013లో భూసేకరణ చట్టం తెచ్చి నిరుపేదలను, 2006లో అటవీహక్కుల చట్టానికి సవరణలు చేసి ఆదివాసీలను ఆదుకున్నారని కొనియాడారు. ఐటీ రంగంలో ప్రస్తుతం దేశం శాసించగలుగుతోందంటే మన్మోహన్ విధానాలే కారణమన్నారు.

Similar News

News December 11, 2025

5 రాష్ట్రాల్లో SIR గడువు పొడిగింపు

image

SIR గడువు వారం రోజులు పొడిగిస్తూ ఎన్నికల సంఘం ఉత్తర్వులిచ్చింది. 5 రాష్ట్రాలు, ఒక కేంద్రపాలిత ప్రాంత CEOల వినతులతో గడువు పొడిగించినట్టు తెలిపింది. యూపీ, ఛత్తీస్‌గఢ్, తమిళనాడు, గుజరాత్, మధ్యప్రదేశ్, అండమాన్ అండ్ నికోబార్‌లో మరో వారంపాటు SIR కొనసాగనుంది. కాగా గోవా, పుదుచ్చేరి, లక్షద్వీప్, రాజస్థాన్, వెస్ట్‌ బెంగాల్‌లో ఈరోజుతో SIR ముగియగా DEC 16న డ్రాఫ్ట్ ఎలక్టోరల్ రోల్ పబ్లిష్ కానుంది.

News December 11, 2025

విజయవాడలో జాతీయ బ్యాడ్మింటన్ ఛాంపియన్‌షిప్ టోర్నమెంటు

image

AP: యోనెక్స్- సన్‌రైజ్ 87వ సీనియర్ నేషనల్ బ్యాడ్మింటన్ ఛాంపియన్‌షిప్-2025 టోర్నమెంటు ఈనెల 24-28 తేదీల్లో విజయవాడలో జరగనుంది. ఇందుకు సంబంధించిన పోస్టర్‌ను CM CBN ఆవిష్కరించారు. ఏపీలో పదేళ్ల తర్వాత ఈ ఛాంపియన్‌షిప్ పోటీలు నిర్వహిస్తున్నామని మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి, శాప్ ఛైర్మన్ రవి నాయుడు తెలిపారు. ఈ టోర్నమెంటును ప్రతిష్ఠాత్మకంగా నిర్వహించాలని సీఎం వారికి సూచించారు.

News December 11, 2025

అందుకే నరసింహ రైట్స్ అమ్మలేదు: రజినీకాంత్

image

రజినీకాంత్ పుట్టినరోజు సందర్భంగా ‘నరసింహ’ మూవీని రేపు రీరిలీజ్‌ చేస్తున్నారు. ‘సినీ కెరీర్ స్టార్ట్ అయ్యి 50 ఏళ్లు. నరసింహ రిలీజై 25 ఏళ్లు పూర్తయ్యాయి. థియేటర్లలో ఈ సినిమా చూసి ఫ్యాన్స్ పండుగ చేసుకోవాలి. అందుకే డిజిటల్ రైట్స్ ఇవ్వలేదు’ అని సినిమా హీరో, ప్రొడ్యూసర్, రచయిత రజినీకాంత్ చెప్పారు. కల్కి కృష్ణమూర్తి రాసిన పొన్నియిన్ సెల్వన్‌లో క్యారెక్టర్ స్ఫూర్తితో నీలాంబరి పాత్ర రాసినట్టు తెలిపారు.