News September 26, 2024
మన్మోహన్ సింగ్ @ 92: మోదీ, రాహుల్ విషెస్

మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్కు PM మోదీ, LoP రాహుల్ సహా ప్రముఖులు బర్త్డే విషెస్ తెలిపారు. ‘మాజీ పీఎం, డాక్టర్ మన్మోహన్ సింగ్కు బర్త్డే విషెస్. మీరు సుదీర్ఘకాలం ఆరోగ్యంగా ఉండాలని ప్రార్థిస్తున్నా’ అని మోదీ ట్వీట్ చేశారు. ‘హ్యాపీ బర్త్డే మన్మోహన్ సింగ్. దేశ భవిష్యత్తును తీర్చిదిద్దడంలో మీ నిస్వార్థ సేవ, వినయం, విజ్ఞానం కోట్లాది భారతీయుల్లో స్ఫూర్తి నింపుతున్నాయి’ అని రాహుల్ Xలో పోస్టు చేశారు.
Similar News
News December 16, 2025
వే2న్యూస్ రీల్ రిపోర్టర్: ₹15,000కు పైగా సంపాదించే అవకాశం

Way2News ఇప్పుడు తెలుగు రాష్ట్రాల్లో 2000 మందికి పైగా రీల్ రిపోర్టర్ల కోసం చూస్తోంది. మీకు కావలసిందల్లా ప్యాషన్, ఒక స్మార్ట్ఫోన్ మాత్రమే. న్యూస్ & ఇన్ఫర్మేటివ్ వీడియో రీల్స్ క్రియేట్ చేయండి. మీ కంటెంట్కి తగ్గట్టు ప్రతి నెల ₹15,000కు పైగా సంపాదించవచ్చు. రీల్ రిపోర్టర్ ప్రోగ్రామ్లో ఎవరైనా జాయిన్ కావచ్చు. వివరాలకు <
News December 16, 2025
కనకాంబరంలో ఆకుమచ్చ తెగులు

కనకాంబరం పంటను ఆశించే చీడపీడల్లో ఆకుమచ్చ తెగులు ఒకటి. ఆకుమచ్చ తెగులు సోకిన కనకాంబరం మొక్క ఆకు పైభాగంలో చిన్న, గుండ్రని పసుపు పచ్చ మచ్చలు ఏర్పడి.. తర్వాత గోధుమ రంగులోకి మారతాయి. తెగులు సోకిన ఆకులు ఎండిపోయి రాలిపోతాయి. దీని వల్ల మొక్క ఎదుగుదలపై ప్రభావం పడుతుంది. ఈ తెగులు నివారణకు 2.5గ్రా మాంకోజెబ్ను లీటర్ నీటికి కలిపి ఆకులన్నీ తడిచేలా పిచికారీ చేయాలి.
News December 16, 2025
రుషికొండ ప్యాలెస్ కోసం టాటా, లీలా గ్రూపుల ప్రతిపాదనలు

AP: విశాఖ రుషికొండ భవనాలపై <<17985023>>GOM<<>> చర్చించింది. ‘ఈ భవనాలపై ప్రజాభిప్రాయం తీసుకున్నాం. హోటళ్ల ఏర్పాటుకు టాటా గ్రూప్, లీలా ప్యాలెస్తో పాటు అంతర్జాతీయ సంస్థల నుంచి ప్రతిపాదనలు వచ్చాయి. వచ్చేవారం మళ్లీ సమావేశమై నిర్ణయం తీసుకొని ప్రభుత్వానికి నివేదిస్తాం’ అని మంత్రి కేశవ్ తెలిపారు. కాగా ఎలాంటి నిర్ణయం తీసుకున్నా ఆదాయం పెరిగేలా చేయడమే ప్రభుత్వ లక్ష్యమని మంత్రి దుర్గేశ్ చెప్పారు.


