News December 29, 2024
హైదరాబాద్లో మన్మోహన్ విగ్రహం?

TG: దివంగత మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్కు హైదరాబాద్లో విగ్రహాన్ని ఏర్పాటు చేయనున్నట్లు ప్రభుత్వ వర్గాలు తెలిపాయి. ఏదైనా ప్రధాన జంక్షన్ వద్ద ఈ విగ్రహం ఉంటుందని సమాచారం. అదే విధంగా ఏదైనా పథకానికి కూడా మన్మోహన్ పేరును పెట్టొచ్చని తెలుస్తోంది. రేపు జరిగే శాసనసభ ప్రత్యేక సమావేశంలో దీనిపై సీఎం రేవంత్ ప్రకటించే ఛాన్స్ ఉంది.
Similar News
News December 18, 2025
వచ్చే 4 రోజులు మరింత చలి

TG: రాష్ట్రంలో నేటి నుంచి 4 రోజుల పాటు చలి తీవ్రత మరింత పెరగనుందని వాతావరణ శాఖ అంచనా వేసింది. ఈ నెల 18 నుంచి 21 వరకు సింగిల్ డిజిట్ ఉష్ణోగ్రతలు కొనసాగనున్నాయి. ఇప్పటికే పలు ప్రాంతాలు చలి గుప్పిట్లో చిక్కుకున్నాయి. బుధవారం సంగారెడ్డి జిల్లా కోహీర్ మండలంలో 7.3 డిగ్రీల అత్యల్ప ఉష్ణోగ్రత నమోదైంది. మెదక్ జిల్లా దామరంచలో 10 డిగ్రీలు, సిద్దిపేట జిల్లా పోతిరెడ్డి పేటలో 9.2 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి.
News December 18, 2025
పాడి రైతులకు అండగా ముర్రా జాతి గేదెలు

తక్కువ ఖర్చుతో ఎక్కువ ఆదాయం పొందాలన్నదే ప్రతి పాడి రైతు కల. అందుకు మనం ఎంచుకునే పశుజాతి, పోషణ కీలకం. సరైన జాగ్రత్తలు తీసుకుంటే ముర్రా జాతి గేదెలతో పాడిరైతుల కలలు నిజమవుతాయంటున్నారు వెటర్నరీ నిపుణులు. ఎందుకంటే ప్రపంచంలో అత్యధిక, మేలైన పాల ఉత్పత్తికి, స్థిరమైన ఆదాయానికి ముర్రాజాతి గేదెలు ప్రసిద్ధి చెందాయి. ఈ గేదెలతో డెయిరీఫామ్ నిర్వహణ ఎందుకు లాభదాయకమో తెలుసుకోవడానికి <<-se_10015>>పాడిపంట<<>> క్లిక్ చేయండి.
News December 18, 2025
ఇంటర్ కాలేజీల రీఓపెన్ రోజే విద్యార్థులకు బుక్స్!

TG: ప్రభుత్వ కాలేజీల రీఓపెన్ రోజే విద్యార్థులకు బుక్స్ ఇవ్వాలని ఇంటర్మీడియట్ కమిషనరేట్ అధికారులు నిర్ణయించారు. పుస్తకాలను ఏప్రిల్ నుంచే మార్కెట్లో అందుబాటులోకి తెచ్చేలా ఏర్పాట్లు చేస్తున్నారు. రాష్ట్రంలోని 430 ప్రభుత్వ జూ.కాలేజీల్లో 1.70 లక్షల మంది చదువుతున్నారు. వీరికి ప్రభుత్వం ఆగస్టు-అక్టోబర్ మధ్య ఫ్రీగా బుక్స్ అందిస్తోంది. ఆలస్యం వల్ల విద్యార్థులు ఇబ్బంది పడకుండా ఈసారి ముందే సిద్ధం చేయనుంది.


