News December 27, 2024
మన్మోహన్ విద్యాభ్యాసం.. పెషావర్ టు ఆక్స్ఫర్డ్

ఇప్పటి పాక్లోని చక్వాల్లో వ్యాపారులైన గురుముఖ్ సింగ్, అమృత్ కౌర్ దంపతులకు 1932 Sep 26న మన్మోహన్ సింగ్ జన్మించారు. పెషావర్లో అప్పర్ ప్రైమరీ స్కూల్లో చదివారు. దేశ విభజన తర్వాత 1948లో వారి కుటుంబం అమృత్సర్కు వచ్చింది. పంజాబ్ వర్సిటీ నుంచి 1952లో ఆర్థిక శాస్త్రంలో డిగ్రీ, 1954లో మాస్టర్స్, 1957లో కేంబ్రిడ్జ్ నుంచి డిగ్రీ, 1962లో ఆక్స్ఫర్డ్ వర్సిటీ నుంచి ఎకనామిక్స్లో DPhil పట్టా పొందారు.
Similar News
News November 27, 2025
రాజ్యాంగంలోని ప్రాథమిక విధులివే..

ప్రాథమిక హక్కులను అనుభవిస్తున్న పౌరులు విధులనూ నిర్వర్తించాలని రాజ్యాంగదినోత్సవంలో నాయకులంతా పిలుపునిచ్చారు. రాజ్యాంగంలోని IV-A భాగంలో 51-Aలో ఉన్న 11 ప్రాథమిక విధులు క్లుప్తంగా.. రాజ్యాంగ సంస్థలు, పతాకం, గీతం, సమరయోధులు, దేశ సార్వభౌమత్వాన్ని గౌరవించాలి. దేశ రక్షణకు సిద్ధంగా ఉండాలి. కుల, మత, ప్రాంత, లింగ విభేదాలకు అతీతంగా ఉండాలి. పర్యావరణం, ప్రభుత్వ ఆస్తులను కాపాడాలి. పిల్లలకు విద్యను అందించాలి.
News November 27, 2025
రిజర్వేషన్లపై హైకోర్టులో నేడే విచారణ

TG: పంచాయతీ ఎన్నికల్లో రిజర్వేషన్ల అమలును నిలిపివేయాలంటూ <<18397909>>దాఖలైన<<>> పిటిషన్పై ఇవాళ HCలో విచారణ జరగనుంది. జనాభా గణాంకాలను వెల్లడించకుండా రిజర్వేషన్లు కేటాయిస్తూ ప్రభుత్వం ఇచ్చిన జీవో 46ను సవాల్ చేస్తూ ఈ పిటిషన్ వేశారు. దీని వల్ల బీసీల్లోని కొన్ని వర్గాలకు అన్యాయం జరుగుతోందని, రిజర్వేషన్ల అమలును నిలిపివేయాలని కోరారు. నేటి నుంచి నామినేషన్ల స్వీకరణ వేళ దీనిపై HC ఎలా స్పందిస్తుందనేది ఆసక్తిగా మారింది.
News November 27, 2025
రాష్ట్రంలో 60 పోస్టులు.. నేటి నుంచి దరఖాస్తుల ఆహ్వానం

తెలంగాణ స్టేట్ లెవల్ పోలీస్ రిక్రూట్మెంట్ బోర్డ్ (<


