News December 27, 2024
మన్మోహన్ చారిత్రక ఆర్థిక సంస్కరణలివే(2/2)

1991లో ఎగుమతులను ప్రోత్సహించడానికి పరిమితులను కుదించారు. రూపాయి విలువను తగ్గించి విదేశీ మార్కెట్లో IND ఉత్పత్తులకు డిమాండ్ పెంచారు. పారిశ్రామిక వృద్ధికి అడ్డుకట్ట వేసే లైసెన్స్ రాజ్ను రద్దు చేశారు. కార్పొరేట్ పన్నులను పెంచారు. వంటగ్యాస్, చక్కెరపై సబ్సిడీలు తగ్గించారు. IMF సాయం పొందటం బంగారాన్ని తాకట్టు పెట్టారు. ఎగుమతి-దిగుమతి నిబంధనలను సరళీకరించారు. ఇలా ఎన్నో విప్లవాత్మక నిర్ణయాలు తీసుకున్నారు.
Similar News
News November 27, 2025
NZB: 34 మందికి రూ.3.35 లక్షల జరిమానా

నిజామాబాద్ కమీషనరేట్ పరిధిలో మద్యం తాగి వాహనాలు నడిపిన 34 మందిని పోలీసులు పట్టుకున్నారు. వారిని గురువారం జిల్లా మార్నింగ్ కోర్టులో సెకండ్ క్లాస్ మేజిస్ట్రేట్ నూర్జహాన్ ఎదుట హాజరుపరిచారు. వారికి రూ.3.35 లక్షల జరిమానా విధిస్తూ తీర్పు ఇచ్చారు. అంతకు ముందు వారికి సంబంధిత పోలీస్ స్టేషన్ అధికారులు కౌన్సెలింగ్ ఇచ్చారు.
News November 27, 2025
టీచర్ అభ్యర్థులకు అలర్ట్.. CTET నోటిఫికేషన్ విడుదల

సెంట్రల్ బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్ CTET-2026 నోటిఫికేషన్ రిలీజ్ చేసింది. ctet.nic.inలో నేటి నుంచి అప్లై చేసుకోవచ్చు. రిజిస్ట్రేషన్ చేసుకోవడానికి చివరి తేదీ డిసెంబర్ 18, 2025. పరీక్ష ఫిబ్రవరి 8, 2026న జరుగుతుంది. దేశవ్యాప్తంగా 132 నగరాల్లో 20 భాషల్లో ఈ ఎగ్జామ్ నిర్వహించనున్నారు. కేంద్రీయ, నవోదయ విద్యాలయాల్లో, రాష్ట్రస్థాయిలో టీచర్ ఉద్యోగాలు సాధించడానికి CTET అవకాశం కల్పిస్తుంది.
News November 27, 2025
బహు భార్యత్వ నిషేధ బిల్లును ఆమోదించిన అస్సాం

బహు భార్యత్వ(పాలిగామీ) నిషేధ బిల్లును అస్సాం అసెంబ్లీ ఇవాళ పాస్ చేసింది. దీని ప్రకారం 2 లేదా అంతకు మించి పెళ్లిళ్లు చేసుకుంటే ఏడేళ్ల జైలు శిక్ష విధించనున్నారు. వివాహం సమయలో ఇప్పటికే ఉన్న జీవిత భాగస్వామి గురించి దాచిన వారికి పదేళ్ల శిక్ష పడనుంది. ‘ఈ బిల్లు ఇస్లాంకు వ్యతిరేకం కాదు. నిజమైన ఇస్లామిక్ ప్రజలు దీన్ని స్వాగతిస్తారు. బహుభార్యత్వాన్ని ఇస్లాం అంగీకరించదు’ అని CM హిమంత బిశ్వ శర్మ తెలిపారు.


