News December 27, 2024
నిగమ్‌బోధ్ ఘాట్‌లో మన్మోహన్ అంత్యక్రియలు: కేంద్రం
మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ అంత్యక్రియలను రేపు ఉదయం 11.45 గంటలకు ఢిల్లీలోని నిగమ్‌బోధ్ ఘాట్‌లో నిర్వహిస్తామని కేంద్ర హోంశాఖ ప్రకటించింది. సైనిక లాంఛనాలతో అంతిమ సంస్కారాలు జరిపేందుకు ఏర్పాట్లు చేయాలని రక్షణ శాఖను కోరినట్లు పేర్కొంది. అటు మన్మోహన్ స్మారక చిహ్నం ఏర్పాటు చేయడానికి ప్రత్యేక స్థలం కేటాయించాలని ఏఐసీసీ చీఫ్ ఖర్గే ప్రధాని మోదీకి లేఖ రాశారు.
Similar News
News December 28, 2024
జీన్స్‌తో వచ్చాడని ఫైన్.. టోర్నీ నుంచి నిష్క్రమించిన కార్ల్సన్
వరల్డ్ రాపిడ్ చెస్ ఛాంపియన్ షిప్ నుంచి మాగ్నస్ కార్ల్సన్(నార్వే) నిష్క్రమించారు. జీన్స్ ధరించి గేమ్‌లో పాల్గొనగా FIDE నిబంధనలను ఉల్లంఘించారని ఆయనకు 200 డాలర్ల జరిమానా విధించింది. డ్రెస్ కోడ్ నిబంధనలు పాటిస్తేనే 9వ రౌండ్లో పాల్గొనే అవకాశముందని తేల్చి చెప్పింది. FIDE నిర్ణయంపై అసహనంతో టోర్నీ నుంచి నిష్క్రమించినట్లు కార్ల్సన్ తెలిపారు. తన ఫ్యాన్స్‌కు క్షమాపణలు చెప్పారు.
News December 28, 2024
ఆస్ట్రేలియా గడ్డపై సెంచరీ చేసిన పిన్న వయస్కులు (భారత ప్లేయర్లు)
*18 ఏళ్ల 253 రోజులు- సచిన్ (సిడ్నీ)
*18 ఏళ్ల 283 రోజులు- సచిన్ (పెర్త్)
*21 ఏళ్ల 91 రోజులు- రిషభ్ పంత్ (సిడ్నీ)
*21 ఏళ్ల 214 రోజులు- నితీశ్ రెడ్డి (మెల్బోర్న్)
*22 ఏళ్ల 42 రోజులు- దత్తు ఫడ్కర్ (ఆడిలైడ్)
*22 ఏళ్ల 263 రోజులు- కేఎల్ రాహుల్ (సిడ్నీ)
*22 ఏళ్ల 330 రోజులు- యశస్వీ జైస్వాల్ (పెర్త్)
*23 ఏళ్ల 80 రోజులు- విరాట్ (ఆడిలైడ్)
News December 28, 2024
RRR సినిమా కన్నా డాక్యుమెంటరీనే ఎమోషనల్: రాజమౌళి
తాను దర్శకత్వం వహించిన RRR సినిమా కన్నా ఇటీవల వచ్చిన డాక్యుమెంటరీనే ఎమోషనల్‌గా ఉందని రాజమౌళి ట్వీట్ చేశారు. 20TB డేటా నుంచి సరైన మెటెరియల్ను తీసిన వాల్ అండ్ ట్రెండ్స్ టీమ్ వర్క్‌ను ప్రశంసించారు. ఎడిటర్ శిరీష, వంశీ పనితీరును మెచ్చుకున్నారు. ఈ టీమ్ వర్క్ పట్ల గర్వంగా ఉందని, ఇలాగే కొనసాగించాలని ఆకాంక్షించారు. RRR సినిమా షూటింగ్ సీన్స్‌తో రూపొందించిన బిహైండ్ అండ్ బియాండ్ ఓటీటీలోకి వచ్చేసింది.