News December 27, 2024

మా హృదయాల్లో మన్మోహన్ స్థానం శాశ్వతం: రేవంత్

image

TG: మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్‌ను స్మరించుకుంటూ సీఎం రేవంత్ రెడ్డి ట్వీట్ చేశారు. ‘అగాధపు అంచుల నుంచి అద్భుత ప్రస్థానం వరకు.. భారత ఆర్థిక వ్యవస్థకు భాగ్య విధాత. మన్మోహన్ జీ.. మా హృదయాల్లో మీ స్థానం శాశ్వతం’ అని పేర్కొన్నారు. ఇవాళ సీఎం ఢిల్లీకి వెళ్లనున్నారు. మన్మోహన్ భౌతిక కాయానికి నివాళులు అర్పించనున్నారు.

Similar News

News December 29, 2025

11 నెలల్లో SCRకు రూ.19,314 కోట్ల ఆదాయం

image

ఈ ఏడాది జనవరి-నవంబర్ మధ్య దక్షిణ మధ్య రైల్వే(SCR)కు రూ.19,314 కోట్ల ఆదాయం సమకూరినట్లు అధికారులు తెలిపారు. గత ఏడాదితో పోలిస్తే(రూ.18,831 కోట్లు) ఇది రూ.483 కోట్లు అధికమని పేర్కొన్నారు. రైళ్ల రద్దీని తగ్గించేందుకు చర్లపల్లి టెర్మినల్‌ను అభివృద్ధి చేసి అందుబాటులోకి తీసుకొచ్చినట్లు వెల్లడించారు. మరోవైపు సంక్రాంతి రద్దీ నేపథ్యంలో JAN 7-12 వరకు మరో 11 ప్రత్యేక రైళ్ల బుకింగ్ ఇవాళ ఉ.8 గంటలకు మొదలుకానుంది.

News December 29, 2025

RSS అల్‌ఖైదా లాంటిది: మాణికం ఠాగూర్

image

RSSను ఉగ్ర సంస్థ అల్‌ఖైదాతో పోలుస్తూ కాంగ్రెస్ MP మాణికం ఠాగూర్ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. ‘RSS విద్వేషాన్ని వ్యాప్తి చేసే సంస్థ. అల్‌ఖైదా లాంటిది. దాని నుంచి <<18686086>>నేర్చుకోవడానికి<<>> ఏమీ లేదు. 140 ఏళ్ల చరిత్ర కలిగిన కాంగ్రెస్ ప్రజలను ఏకతాటిపైకి తెచ్చింది. ప్రజా ఉద్యమంగా పార్టీని గాంధీ మార్చారు. అలాంటి పార్టీ ఈ సంస్థ నుంచి నేర్చుకోవాలా?’ అని ప్రశ్నించారు. దీంతో కాంగ్రెస్ హద్దు దాటుతోందని BJP మండిపడింది.

News December 29, 2025

డెలివరీ తర్వాత ఈ సమస్య వస్తోందా?

image

కొంతమందిలో డెలివరీ తర్వాత నవ్వినా, తుమ్మినా, దగ్గినా, ఇతర ఒత్తిడికరమైన పనులు చేసినా మూత్రాశయం నియంత్రణ కోల్పోతుంది. దీంతో మూత్రం లీక్ అవుతుంది. హార్మోన్లు, టిష్యూల లాక్సిటీ వలన ఇలా జరుగుతుంది. బ్లాడర్ గోడకు సపోర్ట్‌గా ఉండే ఈ టిష్యూలు డెలివరీ టైంలో దెబ్బతింటాయి. సాధారణంగా కొంత కాలానికి సమస్య తగ్గుతుంది. తగ్గకపోతే ఇంట్లోనే కెగెల్ వ్యాయామాలు చెయ్యాలి. అప్పటికీ సమస్య ఉంటే వైద్యులను సంప్రదించాలి.