News April 3, 2024
మన్మోహన్ 33 ఏళ్ల పార్లమెంట్ ప్రస్థానానికి తెర!

మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్(91) రాజ్యసభ పదవీ కాలం నేటితో ముగియనుంది. 1991లో తొలిసారి ఆయన పెద్దల సభలో అడుగుపెట్టారు. 1991 నుంచి 1996 వరకు PV నరసింహారావు ప్రభుత్వంలో ఆర్థిక మంత్రిగా పని చేసిన ఆయన ఎన్నో సంస్కరణలు తీసుకొచ్చి దేశ ఆర్థిక స్థితిని గాడిలో పెట్టారు. 2004-2014 వరకు ప్రధానిగా సేవలు అందించారు. కాగా మన్మోహన్ ప్రాతినిధ్యం వహించిన రాజస్థాన్ నుంచి ఈసారి సోనియా గాంధీ రాజ్యసభలో అడుగుపెడుతున్నారు.
Similar News
News October 18, 2025
‘మలబార్’కు పాక్ ఇన్ఫ్లూయెన్సర్ కష్టాలు

ధంతేరాస్ వేళ మలబార్ గోల్డ్&డైమండ్స్ వివాదంలో చిక్కుకుంది. ఇటీవల ఈ కంపెనీ లండన్లో తమ షోరూమ్ ఓపెనింగ్కు UK బేస్డ్ పాక్ ఇన్ఫ్లూయెన్సర్ అలిష్బా ఖాలీద్తో కొలాబరేట్ కావడమే అందుక్కారణం. గతంలో ఆమె Op సిందూర్ను ‘పిరికి చర్య’గా అభివర్ణించారు. దీంతో మలబార్ యాజమాన్యం పాక్ సానుభూతిపరులుగా వ్యవహరిస్తోందని నెటిజన్లు SMలో పోస్టులు పెట్టారు. సంస్థ బాంబే కోర్టుకెళ్లగా అలాంటి పోస్టులు తొలగించాలని ఆదేశించింది.
News October 18, 2025
దీపావళి దీపాలు: పాటించాల్సిన నియమాలు

దీపావళి రోజున దీపాలను నేరుగా నేలపై పెట్టడం మంచిది కాదని పండితులు చెబుతున్నారు. నేలపై అక్షింతలు పోసి, వాటిపై పెట్టాలని సూచిస్తున్నారు. ‘దీపంలో నూనెను పూర్తిగా నింపకూడదు. అది బయటకి వస్తే లక్ష్మీదేవికి అపకీర్తి కలిగిస్తుంది. ఆరోగ్యం కోసం తూర్పున, ధనం కోసం ఉత్తరాన దీపాలు పెట్టాలి. నేతి దీపానికి పత్తి వత్తిని, నూనె దీపానికి ఎర్ర దారం వత్తిని వాడాలి. పగిలిన ప్రమిదలను వాడొద్దు’ అని సూచిస్తున్నారు.
News October 18, 2025
పాక్ ప్రతి అంగుళం బ్రహ్మోస్ రేంజ్లోనే.. రాజ్నాథ్ వార్నింగ్

పాకిస్థాన్లోని ప్రతి ఇంచ్ తమ బ్రహ్మోస్ మిసైళ్ల రేంజ్లోనే ఉందని రక్షణ మంత్రి రాజ్నాథ్ హెచ్చరించారు. బ్రహ్మోస్ సత్తా ఏంటో ఆపరేషన్ సిందూర్లో తెలిసిందని అన్నారు. ‘Op Sindoor ట్రైలర్ మాత్రమే. ఆ ట్రైలర్తోనే మనమేంటో ప్రత్యర్థికి అర్థమైంది. పాక్కు జన్మనివ్వగలిగిన ఇండియా.. అవసరమైతే ఏమైనా చేయగలదని తెలియజేసింది’ అని చెప్పారు. UP లక్నోలో తయారైన తొలి విడత బ్రహ్మోస్ మిసైళ్లను ఆయన ప్రారంభించి మాట్లాడారు.