News December 28, 2024

నేడు మన్మోహన్ అంత్యక్రియలు

image

మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ అంత్యక్రియలను ఇవాళ ఉదయం 11.45 గంటలకు ఢిల్లీలోని నిగమ్‌బోధ్ ఘాట్‌లో జరగనున్నాయి. సైనిక లాంఛనాలతో అంతిమ సంస్కారాలు నిర్వహించేందుకు కేంద్రం ఏర్పాట్లు చేసింది. తొలుత మన్మోహన్ పార్థీవ దేహాన్ని ఆయన నివాసం నుంచి AICC కార్యాలయానికి తరలిస్తారు. అక్కడ ప్రజల సందర్శనార్థం కొద్దిసేపు ఉంచి నిగమ్‌బోధ్ ఘాట్‌కు తీసుకెళ్తారు.

Similar News

News December 28, 2024

విమాన ప్రమాదం దురదృష్టకరం.. సారీ: పుతిన్

image

కజకిస్థాన్‌లో జరిగిన విమాన ప్రమాద ఘటన దురదృష్టకరమని రష్యా అధ్యక్షుడు పుతిన్ అన్నారు. అందుకు అజర్ బైజాన్ అధ్యక్షుడు ఇల్లామ్ అలియేవ్‌కు క్షమాపణలు చెప్పారు. అజార్ బైజాన్‌లోని బాకు నుంచి రష్యా బయల్దేరిన విమానం కజకిస్థాన్‌లో కుప్పకూలిన విషయం తెలిసిందే. ఈ దుర్ఘటనలో 38 మంది మరణించారు. కాగా ఉక్రెయిన్ డ్రోన్ దాడులను ఎదుర్కొనేందుకు రష్యా ప్రయోగించిన క్షిపణి ఒకటి విమానాన్ని తాకినట్లు అనుమానిస్తున్నారు.

News December 28, 2024

YCP ఫీజు రీయింబర్స్‌మెంట్ ధర్నా వాయిదా

image

AP: విద్యార్థులకు ఫీజు రీయింబర్స్‌మెంట్ నిధులు విడుదల చేయాలనే డిమాండ్‌తో జనవరి 3న తమ పార్టీ నిర్వహించాల్సిన ధర్నాను వాయిదా వేస్తున్నట్లు వైసీపీ అధిష్ఠానం తెలిపింది. దీనిని అదే నెల 29న నిర్వహించనున్నట్లు పేర్కొంది. జనవరి 3న విద్యార్థులకు పరీక్షలు ఉండటంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు వెల్లడించింది.

News December 28, 2024

అకౌంట్లోకి డబ్బులు.. BIG UPDATE

image

TG: సంక్రాంతి నుంచి రైతుభరోసా పథకం ప్రారంభించేందుకు చర్యలు చేపట్టినట్లు మంత్రి తుమ్మల నాగేశ్వరరావు వెల్లడించారు. సాగు చేసే భూమికే పెట్టుబడి సాయం చేస్తామన్నారు. ప్రస్తుతం వ్యవసాయ అధికారులు రైతుల పేర్లు నమోదు చేస్తున్నారని తెలిపారు. సర్వే నంబర్ల వారీగా గ్రామాల్లో సాగు వివరాలు సేకరిస్తున్నామన్నారు. రిమోట్ సెన్సింగ్ డాటా ఆధారంగా సాగు విస్తీర్ణం గుర్తించడంపై పలు కంపెనీల ప్రతినిధులతో ఆయన భేటీ అయ్యారు.