News June 29, 2024
2040 నాటికి చంద్రుడిపైకి మనుషులు: సోమ్‌నాథ్

చంద్రుడిపైకి మనుషులను పంపేందుకు వీలుగా NGLV(నెక్స్ట్ జనరేషన్ లాంఛ్ వెహికల్) అనే భారీ రాకెట్‌ను నిర్మిస్తున్నట్లు ఇస్రో చీఫ్ సోమ్‌నాథ్ వెల్లడించారు. దీన్ని ‘సూర్య’ అని పిలుస్తున్నట్లు తెలిపారు. లిక్విడ్ ఆక్సిజన్, మీథేన్ ఆధారంగా ఇంజిన్‌ను రూపొందిస్తున్నట్లు పేర్కొన్నారు. దీని LEO పేలోడ్ కెపాసిటీ 40టన్నులకు పైగా ఉంటుందని చెప్పారు. 2040 నాటికి చంద్రుని ఉపరితలంపైకి తీసుకెళ్తామని పేర్కొన్నారు.
Similar News
News October 20, 2025
పౌరాణిక కథల సమాహారం ‘దీపావళి’

దీపావళి జరపడానికి 3 పౌరాణిక కథలు ఆధారం. నరక చతుర్దశి నాడే కృష్ణుడు, సత్యభామ కలిసి నరకాసురుడిని సంహరించారు. అధర్మంపై ధర్మ విజయాన్ని స్థాపించారు. దీనికి గుర్తుగా దీపాలు వెలిగించారు. 14 ఏళ్ల వనవాసం తర్వాత రాముడు అయోధ్యకు తిరిగి వచ్చిన రోజు కూడా ఇదే. ఆనాడు అయోధ్య ప్రజలు దీపాలు పెట్టి వారికి స్వాగతం పలికారు. క్షీరసాగర మథనంలో లక్ష్మీదేవి ఉద్భవించింది కూడా ఈ తిథి నాడే. అందుకే లక్ష్మీదేవిని పూజిస్తారు.
News October 20, 2025
ఆర్టీసీ ఉద్యోగుల ప్రమోషన్లకు ప్రభుత్వం ఉత్తర్వులు

AP: ఆర్టీసీలో నాలుగు క్యాడర్ల ఉద్యోగుల పదోన్నతులకు అవకాశమిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. శనివారం ఉద్యోగ సంఘాల నేతలతో సమావేశంలో చంద్రబాబు హామీ ఇవ్వగా నిన్న ప్రభుత్వం ఉత్తర్వులిచ్చింది. పనిష్మెంట్లు, పెనాల్టీలు, క్రమశిక్షణ చర్యలు వంటివి ఉన్నా వాటితో సంబంధం లేకుండా ప్రమోషన్లకు అర్హులుగా పేర్కొంది. దీంతో డ్రైవర్లు, కండక్టర్లు, ఆర్టిజన్స్ క్యాడర్లోని ఉద్యోగులకు ప్రయోజనం చేకూరనుంది.
News October 20, 2025
అనూహ్య ఓటమి.. స్మృతి కంటతడి

WWCలో నిన్న ENGతో జరిగిన కీలక మ్యాచ్‌లో భారత్ అనూహ్యంగా ఓటమిపాలైన విషయం తెలిసిందే. దీంతో వైస్ కెప్టెన్ స్మృతి మంధాన కంటతడి పెట్టారు. ఛేజింగ్ స్టార్టింగ్‌లోనే 2 వికెట్లు కోల్పోయి కష్టాల్లో ఉన్న జట్టును కెప్టెన్ హర్మన్(70)తో కలిసి స్మృతి అద్భుత ఇన్నింగ్స్(88)తో కంఫర్టబుల్ పొజిషన్‌కు తీసుకెళ్లారు. అయినా ఓటమి తప్పకపోవడంతో స్మృతి ఎమోషనల్ అయ్యారు. ఫ్యాన్స్ ఆమెకు సపోర్ట్‌గా SMలో పోస్టులు పెడుతున్నారు.