News April 8, 2025
మంచు విష్ణుపై మనోజ్ ఫిర్యాదు

మంచు కుటుంబంలో మరోసారి వివాదం జరిగినట్లు తెలుస్తోంది. తన ఇల్లు ధ్వంసం చేశారని మంచు విష్ణుపై నార్సింగి పీఎస్‌లో మనోజ్ ఫిర్యాదు చేశారు. తన కూతురు పుట్టినరోజు సందర్భంగా రాజస్థాన్‌కు వెళ్లిన సమయంలో ఇంటిని ధ్వంసం చేశారని, కారుతో పాటు విలువైన వస్తువులను దొంగిలించారని ఫిర్యాదులో పేర్కొన్నారు. తన తండ్రి మోహన్ బాబుతో మాట్లాడే ప్రయత్నం చేశానని, కానీ ఆయన అందుబాటులోకి రాలేదని చెప్పారు.
Similar News
News April 17, 2025
HYD: ఇక్రిశాట్‌లో చిక్కిన చిరుత

HYD శివారులోని ఇక్రిశాట్ పరిశ్రమలో చిరుత పులి చిక్కింది. చిరుత పులుల ఆనవాళ్లు లభ్యం కావడంతో గత రెండ్రోజులుగా కార్మికులు తీవ్ర భయాందోళన వ్యక్తం చేశారు. అటవీ శాఖ అధికారులకు సమాచారం అందడంతో బోన్లు, సీసీ కెమెరాలు బిగించారు. చిరుత కోసం బోన్‌లో రెండు మేకలను ఎరగా వేశారు. బుధవారం <<16105958>>రాత్రి మేకలను<<>> వేటాడటానికి వచ్చిన చిరుత పట్టుబడింది. చిరుతను జూపార్క్‌కు వాహనంలో తరలించినట్లు తెలుస్తోంది.
News April 17, 2025
SRH vs MI: ఈరోజేనా 300 లోడింగ్!

IPLలో ఇవాళ SRH, MI మధ్య మ్యాచ్ జరగనుంది. దీంతో SRH ఫ్యాన్స్ 300 లోడింగ్ అంటూ మళ్లీ నెట్టింట సందడి చేస్తున్నారు. వాంఖడే స్టేడియం బ్యాటింగ్‌కు అనుకూలం కావడం, అభిషేక్, హెడ్ ఫామ్‌లో ఉండడంతో ఈ ఫీట్ అందుకోవడం సాధ్యమేనని కామెంట్లు చేస్తున్నారు. ఓపెనర్లు తుఫాన్ ఇన్నింగ్స్ ఆడితే రికార్డు క్రియేట్ చేయడం ఖాయమంటున్నారు. కాగా ఈ మ్యాచులో 300 స్కోర్ పక్కా అని <<16106276>>డేల్ స్టెయిన్<<>> గతంలోనే ట్వీట్ చేసిన విషయం తెలిసిందే.
News April 17, 2025
ప్రపంచంలో మొట్టమొదటి స్పెర్మ్ రేస్.. ఎక్కడంటే?

లాస్ ఏంజెలిస్‌లో ప్రపంచంలోనే తొలిసారిగా స్పెర్మ్ రేస్ ఈ నెల 25న జరగబోతోంది. తగ్గుతున్న పురుషుల సంతానోత్పత్తి రేటుపై అవగాహన కల్పించేందుకు స్పెర్మ్ రేస్ అనే స్టార్టప్ కంపెనీ ఈ వినూత్న కార్యక్రమం చేపడుతోంది. ఈ రేస్‌లో 1,000 మంది పాల్గొంటారు. వీర్యం నమూనాలను 20 సెం.మీ పొడవైన మైక్రోస్కోపిక్ రేస్ ట్రాక్‌పై ఉంచుతారు. ఏ నమూనా స్పెర్మ్ ముందుగా ఫినిష్ లైన్ చేరుకుంటుందో దానిని విజేతగా ప్రకటిస్తారు.