News December 10, 2024
మనోజ్.. నిన్ను కనడమే నేను చేసిన పాపమా?: మోహన్ బాబు

TG: మంచు మనోజ్ తీరుతో వాళ్ల అమ్మ ఆసుపత్రిలో చేరిందని మోహన్ బాబు అన్నారు. అతని ప్రవర్తనతో తన మనసు ఆవేదనతో కుంగిపోయిందని చెప్పారు. మనోజ్ తనను కొట్టలేదని, ఇద్దరి మధ్య ఘర్షణ జరిగిందని పేర్కొన్నారు. భార్య మాటలు విని తన కుమారుడు తాగుడుకు అలవాటయ్యాడన్నారు. ‘మనోజ్‌కు జన్మనివ్వడమే నేను చేసిన పాపమా?’ అని మోహన్ బాబు అన్నారు. ఆస్తులు ఎలా పంచాలి అన్నది తన ఇష్టమని స్పష్టం చేశారు.
Similar News
News December 19, 2025
Unknown నంబర్ నుంచి వీడియో కాల్ చేసి..

అన్‌నోన్ నంబర్ల నుంచి వచ్చే వీడియో కాల్స్ లిఫ్ట్ చేయొద్దని పోలీసులు హెచ్చరిస్తున్నారు. ఇలా ఓ మహిళతో వీడియో కాల్ మాట్లాడిన HYD వ్యక్తి బ్లాక్‌మెయిల్‌కు గురై ₹3.41L పోగొట్టుకున్నాడు. మహిళ వీడియో కాల్ చేసి అతడిని సెడ్యూస్ చేయగా, అది వైరల్ చేస్తామంటూ మరో వ్యక్తి బెదిరించాడు. పలుమార్లు డబ్బులు వసూలు చేశాడు. తన బ్యాంక్ అకౌంట్స్ హ్యాకవడం, మరిన్ని డబ్బులు డిమాండ్ చేయడంతో బాధితుడు పోలీసులను ఆశ్రయించాడు.
News December 19, 2025
వైఎస్ జగన్ బర్త్ డే CDP పోస్ట్ చేసిన వైసీపీ

AP: ఎల్లుండి వైసీపీ చీఫ్ జగన్ పుట్టినరోజు నేపథ్యంలో ఆయన CDPని ఆ పార్టీ Xలో పోస్ట్ చేసింది. ప్రజా నాయకుడు జగన్ అని పేర్కొంటూ ఫొటోను రిలీజ్ చేసింది. ‘సవాళ్లు ఎదురైనా.. కష్టాలు పరీక్షించినా మొక్కవోని దీక్షతో నమ్మిన సిద్ధాంతానికి నిబద్ధతతో నిలబడే నాయకుడు వైఎస్ జగన్. పుట్టిన రోజు శుభాకాంక్షలు జగన్ అన్న’ అని ట్వీట్ చేసింది.
News December 19, 2025
జాబ్ ఛేంజ్ మధ్య 60 రోజుల గ్యాప్ ఉన్నా EDLI ప్రయోజనం

జాబ్ ఛేంజ్ అయ్యేవారికి ‘ఎంప్లాయీస్ డిపాజిట్ లింక్డ్ ఇన్సూరెన్స్’ (EDLI) విషయంలో ఇక ఆందోళన అక్కర్లేదు. మరో కంపెనీలో చేరడానికి ముందు వీకెండ్స్, అధికారిక సెలవులతో పాటు 60 రోజుల గ్యాప్‌ను సర్వీస్ బ్రేక్ కింద పరిగణించకూడదని EPFO స్పష్టం చేసింది. సర్వీస్ బ్రేక్ పేరిట EDLI స్కీమ్ కింద డెత్ క్లెయిమ్స్ రిజెక్ట్ అవ్వడం లేదంటే తక్కువ చెల్లిస్తున్న నేపథ్యంలో నిబంధనల్లో EPFO ఈ మేరకు మార్పులు చేసింది.


