News December 10, 2024
మోహన్బాబు ఫిర్యాదుపై మనోజ్ స్పందన

TG: తన తండ్రి మోహన్బాబు <<14835430>>ఫిర్యాదు<<>>పై మనోజ్ స్పందించారు. ‘నాతో పాటు నా భార్య మౌనికపై అసత్య ఆరోపణలు చేస్తున్నారు. కుటుంబ వ్యవహారాల్లో మాకు రక్షణగా నిలబడాలని ఇరురాష్ట్రాల CMలను కోరుతున్నా. ఆస్తుల కోసం నేనెప్పుడూ ఆశ పడలేదు. నేను, నా భార్య సొంత కాళ్లపై నిలబడి సంపాదించుకుంటున్నాం. కుటుంబ గౌరవాన్ని కాపాడేందుకు ప్రతిసారి ప్రయత్నం చేశాను. వివాదాల్లో నా కూతుర్ని కూడా చేర్చడం బాధాకరం’ అని అన్నారు.
Similar News
News November 25, 2025
తెలంగాణలో పెరుగుతున్న భూగర్భ జలమట్టం

TG: గత పదేళ్లుగా వర్షాకాలం తర్వాత కూడా కురుస్తున్న వర్షాలతో రాష్ట్రంలో ప్రాజెక్టులు, రిజర్వాయర్లు, చెరువులు, కుంటల్లో నీటి నిల్వలు పెరుగుతున్నాయి. దీంతో పదేళ్లుగా భూగర్భ జలమట్టం పెరుగుతోందని TG జలవనరులశాఖ తెలిపింది. ఆసిఫాబాద్, నిర్మల్, KMR, NZB, ADB, పెద్దపల్లి, SDP, MDK, WGL, HNK, MHBD, SRPT, MBNR, NGKL, గద్వాల, NRPT,VKB, SRD, NLG, రంగారెడ్డి జిల్లాల పరిధిలోని మండలాల్లో జలమట్టం పెరిగింది.
News November 25, 2025
నవంబర్ నారీమణులదే

ఈ నెలలో భారత నారీమణులు ప్రపంచ వేదికలపై అదరగొట్టారు. ఈ నెల 2న భారత మహిళా క్రికెట్ జట్టు వన్డే వరల్డ్ కప్ విజేతగా నిలవగా, 23న అంధుల మహిళల టీమ్ టీ20 వరల్డ్ కప్ నెగ్గింది. నిన్న ఉమెన్ ఇన్ బ్లూ కబడ్డీ వరల్డ్ కప్ సొంతం చేసుకున్నారు. ఈ విజయాలు క్రీడల్లో మహిళలను ప్రోత్సహించేందుకు మరింత ఉపయోగపడుతాయని క్రీడా విశ్లేషకులు అంటున్నారు. నవంబర్ నెలలో మహిళలు డామినేట్ చేశారని పలువురు పోస్టులు చేస్తున్నారు.
News November 25, 2025
భారీగా పెరిగిన బంగారం ధరలు

హైదరాబాద్ బులియన్ మార్కెట్లో ఇవాళ బంగారం ధరలు భారీగా పెరిగాయి. 24 క్యారెట్ల 10గ్రాముల పసిడి ధర రూ.1,910 పెరిగి రూ.1,27,040కు చేరింది. అలాగే 22 క్యారెట్ల 10గ్రాముల గోల్డ్ రేటు రూ.1,750 ఎగబాకి రూ.1,16,450 పలుకుతోంది. అటు కేజీ వెండిపై రూ.3,000 పెరిగి రూ. 1,74,000గా ఉంది. రెండు తెలుగు రాష్ట్రాల్లో దాదాపు ఇవే ధరలున్నాయి.


