News November 30, 2024

మంత్రి లోకేశ్ పాజిటివ్ ఎనర్జీ సూపర్: మంచు విష్ణు

image

AP: మంత్రి నారా లోకేశ్‌తో సమావేశమైనట్లు హీరో మంచు విష్ణు వెల్లడించారు. ఇద్దరూ కలిసి దిగిన ఫొటోను సోషల్ మీడియాలో షేర్ చేశారు. ‘నా సోదరుడు, డైనమిక్ విద్యాశాఖ మంత్రి లోకేశ్‌తో సానుకూల వాతావరణంలో పలు అంశాలపై మాట్లాడా. అతని పాజిటివ్ ఎనర్జీ అద్భుతం. లోకేశ్‌కు దేవుడు మరింత శక్తి ఇవ్వాలని కోరుకుంటున్నా’ అని రాసుకొచ్చారు.

Similar News

News April 6, 2026

ట్రంప్‌ను పదవి నుంచి తొలగిస్తారా?

image

ట్రంప్‌ను అధ్యక్ష పదవి నుంచి తొలగిస్తారనే ఊహాగానాలు పెరుగుతున్నాయి. ఓ చట్టసభ్యుడు కూడా అందుకు ప్రతిపాదించారని సమాచారం. కాల్షీ వంటి బెట్టింగ్ ప్లాట్‌ఫామ్స్‌లో ఆయన తొలగింపుపై పందెం వేసే వారి సంఖ్య పెరుగుతోంది. ఇరాన్‌తో యుద్ధం, కీలక నిర్ణయాల్లో ఆయన వ్యవహారశైలే అందుకు కారణం. ట్రంప్‌ను 25వ అమెండ్‌మెంట్ ఆధారంగా తొలగిస్తారా అనే ప్రశ్నకు ‘Yes’ అన్నవారి సంఖ్య గతనెలలో 28.6% ఉండగా ఇప్పుడది 35.1%కి చేరింది.

News April 6, 2026

₹6.5 లక్షల కోట్లకు బంగారం దిగుమతులు

image

గత ఆర్థిక సంవత్సరం ఏప్రిల్ నుంచి ఫిబ్రవరి వరకు దేశంలోకి బంగారం దిగుమతులు 28.73% పెరిగాయి. వీటి విలువ సుమారు ₹6.5 లక్షల కోట్లుగా నమోదైంది. పసిడి ధరలు భారీగా పెరగడమే దీనికి కారణం. ప్రస్తుతం 10 గ్రాముల బంగారం ధర ₹1,50,000 దాటిపోయింది. స్విట్జర్లాండ్ నుంచి అత్యధికంగా 40% బంగారం దిగుమతి అవుతోంది. ఈ దిగుమతుల ప్రభావంతో దేశ వాణిజ్య లోటు కూడా పెరిగి ₹29.20 లక్షల కోట్లకు చేరినట్లు గణాంకాలు చెబుతున్నాయి.

News April 6, 2026

ట్రంప్ హెచ్చరికలపై ఇరాన్ సెటైర్లు!

image

హార్ముజ్ జలసంధిని తెరవకపోతే నరకానికి పంపుతానంటూ బూతులతో ట్రంప్ <<19575126>>హెచ్చరించడం<<>>పై ఇరాన్ సెటైర్లు వేస్తోంది. ‘ఓ టీనేజర్‌లా అధ్యక్షుడు బూతులు తిట్టే తీరు చూస్తుంటే.. అమెరికా ఊహించిన దాని కంటే ముందే రాతియుగానికి చేరుకున్నట్లు కనిపిస్తోంది’ అని థాయ్‌లాండ్‌లోని ఇరాన్ ఎంబసీ ఎద్దేవా చేసింది. ‘ట్రంప్.. ఇంకేదైనా మాట్లాడవా. బోర్ కొడుతోంది’ అంటూ జింబాబ్వేలోని ఎంబసీ ఎగతాళి చేసింది.