News August 5, 2024

పతకాలతో ఐఫిల్ టవర్ ‌వద్ద మను

image

పారిస్‌కు తలమానికమైన ఐఫిల్ టవర్ ఎదుట మనూ భాకర్ తన కాంస్య పతకాలతో తాజాగా ఫొటో దిగారు. ‘పిక్ ఆఫ్ ది డే’ అంటూ క్రీడాభిమానులు ఆ ఫొటోను షేర్ చేస్తున్నారు. పారిస్ ఒలింపిక్స్‌లో భారత్‌కు ఇప్పటి వరకు 3 కాంస్య పతకాలు రాగా వాటిలో రెండు మనూ భాకర్‌వే. 124 ఏళ్ల రికార్డు బద్దలుగొట్టిన ఆమె పేరు దేశవ్యాప్తంగా మారుమోగుతోంది. పలు బ్రాండ్లు ఆమెను తమ ప్రచారకర్తగా నియమించుకునేందుకు పోటీ పడుతున్నాయి.

Similar News

News December 14, 2025

ఉగ్రవాదాన్ని సహించబోం.. సిడ్నీ అటాక్‌పై మోదీ

image

ఆస్ట్రేలియాలోని సిడ్నీ బీచ్‌లో జరిగిన <<18561798>>కాల్పుల<<>>పై ప్రధాని మోదీ స్పందించారు. ఈ ఘటన తనను తీవ్ర దిగ్భ్రాంతికి గురిచేసిందని, బాధిత కుటుంబాలకు సంతాపం తెలియజేస్తున్నానని పేర్కొన్నారు. ఉగ్రవాదాన్ని భారత్ సహించబోదని మరోసారి స్పష్టం చేశారు. టెర్రరిజంపై చేసే పోరాటానికి మద్దతు ఇస్తుందని తెలిపారు. కాగా కాల్పుల్లో ఇప్పటిదాకా 12 మంది చనిపోయారు. ఓ దుండగుడు హతమవ్వగా, పట్టుబడిన వ్యక్తి నవీద్ అక్రమ్‌గా గుర్తించారు.

News December 14, 2025

తిహార్ జైలును తరలించనున్న ఢిల్లీ సర్కార్

image

దక్షిణ ఆసియాలోనే అతిపెద్ద కారాగారంగా పేరొందిన ఢిల్లీలోని తిహార్ జైలును మరోచోటుకు తరలించేందుకు ప్రభుత్వం సిద్ధమైంది. ఢిల్లీ CM రేఖా గుప్తా ఈ విషయాన్ని తాజాగా వెల్లడించారు. జైలులో ఖైదీల సంఖ్య ఎక్కువగా ఉండటంతో పాటు భద్రతా సమస్యలు, మౌలిక వసతుల మెరుగుదల కోసం ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు. సుమారు 10,000 మంది సామర్థ్యం ఉన్న తిహార్‌లో ప్రస్తుతం 19,000 మందికిపైగా ఖైదీలు ఉన్నారు.

News December 14, 2025

ఆరేళ్ల ప్రేమ.. ఇద్దరు పిల్లలు.. త్వరలో పెళ్లి

image

బాలీవుడ్‌ నటుడు అర్జున్‌ రాంపాల్‌ ఆరేళ్లుగా ప్రేమలో ఉన్న గాబ్రియెల్లా డెమెట్రియాడ్స్‌ను త్వరలో పెళ్లి చేసుకోబోతున్నారు. ఇప్పటికే ఎంగేజ్‌మెంట్‌ కూడా అయిందని ఓ పాడ్‌కాస్ట్‌లో తెలిపారు. 2019లో మెహర్‌ జెసియాతో విడాకుల తర్వాత గాబ్రియెల్లాతో అర్జున్‌ ప్రేమ బంధం కొనసాగుతోంది. పెళ్లికి ముందే వీరికి ఇద్దరు కుమారులు ఉన్నారు. గాబ్రియెల్లా తెలుగులో ‘ఊపిరి’ సినిమాలో, అర్జున్‌ ‘భగవంత్‌ కేసరి’లో మెప్పించారు.