News August 2, 2024
ఫైనల్స్‌కు దూసుకెళ్లిన మనూ భాకర్
పారిస్ ఒలింపిక్స్‌లో భారత షూటర్ మనూ భాకర్ సత్తా చాటుతున్నారు. మహిళల 25మీటర్ల ఎయిర్ పిస్టల్ విభాగంలో ఆమె ఫైనల్స్‌కు దూసుకెళ్లారు. రేపు మధ్యాహ్నం ఒంటి గంటకు ఫైనల్ జరగనుంది. 10మీటర్ల ఎయిర్ పిస్టల్, 10 మీటర్ల ఎయిర్ పిస్టల్ మిక్స్డ్ విభాగాల్లో ఇప్పటికే ఆమె కాంస్య పతకాలు సాధించారు. <<-se>>#Olympics2024<<>>
Similar News
News February 3, 2025
మొరాయిస్తున్న ఇస్రో ఉపగ్రహం
గత నెల 29న ఇస్రో ప్రయోగించిన NVS-02 ఉపగ్రహంలో స్వల్ప సాంకేతిక ఇబ్బంది తలెత్తింది. ఆక్సిడైజర్లను సరఫరా చేసే వాల్వ్‌లు తెరచుకోకపోవడంతో ఇంజిన్లు మొరాయిస్తున్నట్లు ఇస్రో తెలిపింది. ఇంజిన్లు ఫైర్ అయితేనే శాటిలైట్‌ను నిర్దేశిత కక్ష్యలోకి ప్రవేశపెట్టేందుకు అవకాశం ఉంటుంది. భారత్ సొంత నేవిగేషన్ వ్యవస్థ అయిన నావిక్‌కు NVS-02 కీలకం. ఈ నేపథ్యంలో పరిష్కార మార్గాల్ని ఇస్రో అన్వేషిస్తోంది.
News February 3, 2025
నేడు ఈ స్కూళ్లకు సెలవు!
వసంత పంచమి పర్వదినం సందర్భంగా తెలంగాణ ప్రభుత్వం ఇవాళ ఆప్షనల్ హాలిడే ఇచ్చింది. దీంతో హిందుత్వ, ఆధ్యాత్మిక సంస్థల ఆధ్వర్యంలో నడిచే స్కూళ్లకు ఈరోజు సెలవు ఉండనుంది. మిగిలిన విద్యాసంస్థలకు సెలవు ఇవ్వాలా లేదా అనేది యాజమాన్యాలపై ఆధారపడి ఉంటుంది. అటు ఏపీలో ఎలాంటి ఆప్షనల్ హాలిడే లేదు. మరి మీకు సెలవు ఉందా? కామెంట్ చేయండి.
News February 3, 2025
వచ్చే ఎన్నికల్లో బీసీ వ్యక్తే CM: తీన్మార్ మల్లన్న
TG: వచ్చే ఎన్నికల్లో బీసీ వ్యక్తి CM అవడం ఖాయమని, రేవంత్ రెడ్డే చివరి OC CM అని కాంగ్రెస్ MLC తీన్మార్ మల్లన్న అన్నారు. హనుమకొండలో ‘బీసీ రాజకీయ యుద్ధభేరి’ సభలో ఆయన పలు వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. తెలంగాణకు BCలే ఓనర్లు అని, అవసరమైతే BRS పార్టీని కొనేంత డబ్బు తమ దగ్గర ఉందని అన్నారు. OC వర్గాల నుంచే 60మంది MLAలు ఉన్నారని, బీ ఫారం ఇవ్వని వారితో BCలకు ఇక యుద్ధమేనని ఘాటుగా వ్యాఖ్యానించారు.