News July 31, 2024

LIC, BAJAJకు మనూ భాకర్ నోటీసులు

image

ఎల్‌ఐసీ, బజాజ్ ఫుడ్స్, ఫిట్జీ వంటి సంస్థలకు ఒలింపిక్ డబుల్ మెడలిస్ట్ మనూ భాకర్ నోటీసులు పంపారు. అనుమతి లేకుండా ఆ సంస్థలు తన ఫొటోలు, వీడియోలు వినియోగించటంతో ఆమె ఈ నిర్ణయం తీసుకున్నారు. సదరు సంస్థలపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని నోటీసుల్లో హెచ్చరించారు. దాదాపు 24 సంస్థలు మనూ ఫొటోలు వినియోగించినట్లు IOS ఎండీ నీరవ్ తోమర్ తెలిపారు. ఇలాంటి చర్యలు ఏమాత్రం ఆమోదయోగ్యం కావని ఆయన పేర్కొన్నారు.

Similar News

News February 2, 2025

షర్మిలతో విజయసాయిరెడ్డి భేటీ?

image

AP: రాష్ట్ర కాంగ్రెస్ అధ్యక్షురాలు వైఎస్ షర్మిలతో YCP మాజీ ఎంపీ విజయసాయి రెడ్డి భేటీ అయినట్లు తెలుస్తోంది. 3 రోజుల కిందట హైదరాబాద్‌లోని లోటస్‌పాండ్‌లో దాదాపు 3 గంటల పాటు సమావేశం అయినట్లు సమాచారం. ఈ భేటీలో రాష్ట్రానికి సంబంధించిన రాజకీయ అంశాలు చర్చకు వచ్చినట్లు వినికిడి. ఇటీవల వైసీపీ, రాజకీయాలకు గుడ్ బై చెప్పిన VSR షర్మిలతో రహస్యంగా భేటీ కావడంపై రాజకీయ వర్గాల్లో తీవ్ర చర్చ జరుగుతోంది.

News February 2, 2025

ఉప్పు గనుల్లో ఉంచి చికిత్స చేస్తారు!

image

ఆస్తమా రోగులకు వినూత్నంగా చికిత్స అందిస్తోంది ఉక్రెయిన్. అక్కడున్న ఉప్పు గనుల్లో ఏర్పాటు చేసిన ప్రత్యేక రిసార్ట్ ఉబ్బసం రోగులకు ట్రీట్మెంట్ ఇస్తోంది. గనిలోని అధిక ఉప్పు సాంద్రత ఒక మైక్రోక్లైమేట్‌ను సృష్టించి ఊపిరితిత్తులను పొడిగా ఉంచడంలో సహాయపడుతుందని వైద్యులు చెబుతున్నారు. రోగులు గనిలోనే కొంత సమయాన్ని వెచ్చించాల్సి ఉంటుంది. ఇలా చేయడం వల్ల శ్వాసకోశ ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుందని నమ్ముతారు.

News February 1, 2025

భారీగా పెరిగిన జీఎస్టీ కలెక్షన్లు

image

దేశంలో జనవరి నెలకు సంబంధించి జీఎస్టీ వసూళ్లు భారీగా పెరిగాయి. 12.3శాతం పెరిగి రూ.1,95,506 కోట్లకు చేరినట్లు కేంద్ర ప్రభుత్వం వెల్లడించింది. ఇందులో దేశీయ లావాదేవీలతో సమకూరిన జీఎస్టీ రూ.1.47 లక్షల కోట్లు కాగా, దిగుమతి వస్తువులపై విధించిన పన్నులతో వచ్చిన ఆదాయం రూ.48,382 కోట్లుగా ఉంది. రీఫండ్స్ కింద రూ.23,853 కోట్లు విడుదల చేయగా, చివరకు వసూళ్లు రూ.1.72 లక్షల కోట్లుగా ఉన్నాయి.