News August 7, 2024
మళ్లీ పారిస్‌కు మనూ భాకర్.. ఎందుకంటే?

ఒలింపిక్ డబుల్ మెడలిస్ట్ మనూ భాకర్ ఇవాళ స్వదేశానికి చేరుకున్నారు. ఢిల్లీ ఎయిర్‌పోర్ట్‌లో ఆమెకు ఘనస్వాగతం లభించింది. కాగా ఈ నెల 11న జరిగే ఒలింపిక్స్ ముగింపు వేడుకల్లో పాల్గొనేందుకు ఆమె మళ్లీ పారిస్ వెళ్లనున్నారు. భారత ఫ్లాగ్ బేరర్‌గా మను వ్యవహరించనున్నారు. దీంతో ఈ నెల 9న ఆమె ఇక్కడి నుంచి ఫ్రాన్స్ బయల్దేరి వెళ్లనున్నారు. ఇవాళ క్రీడాశాఖ మంత్రి మన్సుఖ్ మాండవీయాతో ఆమె భేటీ కానున్నారు.
Similar News
News January 29, 2026
RBIలో ఉద్యోగాలకు దరఖాస్తుల ఆహ్వానం

రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా(<
News January 29, 2026
KCRకు నోటీసుల్లో దురుద్దేశం లేదు: మహేశ్‌గౌడ్

TG: ఫోన్ ట్యాపింగ్ కేసులో KCRకు నోటీసులివ్వడంలో రాజకీయ దురుద్దేశం లేదని పీసీసీ చీఫ్ మహేశ్‌గౌడ్ తెలిపారు. ఉద్యమ నాయకుడిగా కేసీఆర్ అంటే గౌరవం ఉందన్నారు. ఈ కేసులో విచారణ పారదర్శకంగా జరుగుతోందని, SIT ఎవరికైనా నోటీసులు ఇవ్వొచ్చన్నారు. గత CM, మంత్రుల ప్రమేయం లేకుండా అధికారులు ఫోన్ ట్యాపింగ్ చేసే ఛాన్స్ లేదని చెప్పారు. పూర్తి విచారణ జరిగితే నిజాలు బయటపడతాయని, కేసులో భాగస్వాములు ఎవరో తేలాల్సి ఉందన్నారు.
News January 29, 2026
రైల్వేలో 312 పోస్టులు.. అప్లైకి ఇవాళే లాస్ట్ డేట్

రైల్వే ఐసోలేటెడ్ కేటగిరీలో 312 పోస్టులకు అప్లై చేయడానికి ఇవాళే ఆఖరు తేదీ. అర్హత గల అభ్యర్థులు అప్లై చేసుకోవచ్చు. పోస్టును బట్టి ఇంటర్, డిగ్రీ, LLB, MBA, డిప్లొమా, PG(హిందీ, ఇంగ్లిష్, సైకాలజీ) అర్హతతో పాటు పని అనుభవం ఉండాలి. CBT(1, 2), స్కిల్ టెస్ట్, DV, మెడికల్ టెస్ట్ ఆధారంగా ఎంపిక చేస్తారు. నెలకు జీతం రూ.19,900-రూ.44,900 వరకు చెల్లిస్తారు. సైట్: www.rrbcdg.gov.in/


