News July 30, 2024
ఈరోజు గెలిస్తే చరిత్రలోకి మను భాకర్

పారిస్ ఒలింపిక్స్లో మరో అరుదైన రికార్డుకు చేరువలో ఉన్నారు మను భాకర్. ఇప్పటికే వ్యక్తిగత విభాగంలో కాంస్యం సాధించగా, ఈరోజు 10 మీటర్ల ఎయిర్ పిస్టల్ మిక్స్డ్ టీమ్ కాంస్యం కోసం పోటీ పడుతున్నారు. ఇదీ గెలిస్తే 124 ఏళ్లలో భారత్ తరఫున ఒకే ఒలింపిక్స్లో రెండు పతకాలు గెలిచిన ప్లేయర్గా ఆమె నిలుస్తారు. చివరిగా 1900 ఒలింపిక్స్లో నార్మన్ ప్రిచర్డ్ అనే బ్రిటీష్ ఇండియన్ భారత్ తరఫున రెండు పతకాలు గెలిచారు.
Similar News
News November 24, 2025
రబీ రాగుల సాగు- మధ్యకాలిక, స్వల్ప కాలిక రకాలు

☛ సప్తగిరి: ఇది మధ్యకాలిక రకం. పంట కాలం 100-105 రోజులు. ముద్దకంకి కలిగి, అగ్గి తెగులును తట్టుకొని 12-15 క్వింటాళ్ల దిగుబడినిస్తుంది. ☛ వకుళ: పంట కాలం 105-110 రోజులు. దిగుబడి- ఎకరాకు 13-15 క్వింటాళ్లు. ☛ హిమ- తెల్ల గింజ రాగి రకం. పంటకాలం 105-110 రోజులు. దిగుబడి: 10-12 క్వింటాళ్లు. ☛ మారుతి: స్వల్పకాలిక రకం. పంట కాలం 85-90 రోజులు. ఎకరాకు 10-12 క్వింటాళ్ల దిగుబడిస్తుంది. అంతర పంటగా వేసుకోవచ్చు.
News November 24, 2025
అనంతమైన పుణ్యాన్ని ఇచ్చే విష్ణు నామం

ఋషిర్నామ్నాం సహస్రస్య వేదవ్యాసో మహామునిః|
ఛన్దో నుష్టుప్ తథా దేవో భగవాన్ దేవకీసుతః||
విష్ణు సహస్ర నామాలకు రుషి ‘వేదవ్యాసుడు’. ఈ స్తోత్రం ఛందస్సు ‘అనుష్టుప్’. ఈ పారాయణంలో దేవకీ పుత్రుడైన కృష్ణుడిని ఆరాధిస్తాం. అయితే శ్లోకాలను పఠించే ముందు భక్తులు వివరాలు తెలుసుకోవాలి. విష్ణు నామాల మూలం, ఛందస్సు, ఆరాధ దైవం గురించి తెలుసుకొని మరింత సంకల్పంతో పఠిస్తే అనంతమైన పుణ్యం లభిస్తుంది. <<-se>>#VISHNUSAHASRANAMAM<<>>
News November 24, 2025
క్రీడాకారులకు ఆర్మీలో ఉద్యోగాలు

<


