News September 26, 2024
మనూ భాకర్ ఇన్స్పైరింగ్ ట్వీట్

తన లక్ష్య సాధనలో ఎన్ని సమస్యలు వచ్చినా పోరాడిన తీరును ఒలింపిక్ మెడలిస్ట్ మనూ భాకర్ గుర్తుచేసుకున్నారు. ‘నాకు 14 ఏళ్లు ఉన్నపుడు షూటింగ్ ప్రయాణం ప్రారంభించా. మీరు ఏదైనా ప్రారంభించిన తర్వాత మీ కలలు ఎంత పెద్దవైనా వాటిని పూర్తిచేసేందుకు సాధ్యమైనవన్నీ చేయండి. లక్ష్య సాధనకు కట్టుబడి, ఏకాగ్రతతో మీ ప్రయాణం కొనసాగించండి. ఒలింపిక్లో స్వర్ణం సాధించే నా కల కోసం కష్టపడుతూనే ఉంటా’ అని ట్వీట్ చేశారు.
Similar News
News September 19, 2025
టీడీపీలోకి మాజీ ఎమ్మెల్సీ మర్రి రాజశేఖర్

AP: మాజీ ఎమ్మెల్సీ మర్రి రాజశేఖర్ ఇవాళ సీఎం చంద్రబాబు సమక్షంలో టీడీపీలో చేరనున్నారు. ఆయనతో పాటు చిలకలూరిపేటకు చెందిన పలువురు వైసీపీ నేతలు టీడీపీ కండువా కప్పుకోనున్నారు. మాజీ మంత్రి విడదల రజినితో విభేదాల కారణంగా ఇప్పటికే ఆయన వైసీపీకి, ఎమ్మెల్సీ పదవికి రాజీనామా చేశారు. గతంలో చిలకలూరిపేట ఎమ్మెల్యేగా ఎన్నికైన రాజశేఖర్ వైసీపీ రీజినల్ కో ఆర్డినేటర్గానూ పనిచేశారు.
News September 19, 2025
బొప్పాయిలో రింగ్ స్పాట్ వైరస్ – లక్షణాలు

రింగ్ స్పాట్ వైరస్ సోకిన బొప్పాయి చెట్ల లేత ఆకులు పసుపు పచ్చగా మారతాయి. ఆకుల ఈనెలు వంగి ముడుచుకుపోతాయి. పూత, పిందె, కాయ, పండ్లపై గోధుమ రంగులో ఉంగరాల్లాంటి రింగుల మచ్చలు ఏర్పడతాయి. ఆ రింగు మధ్య బాగం ఆకుపచ్చగా ఉంటుంది. తెగులు సోకిన పూలు.. పిందెగా మారవు. పిందెలు ఎదగవు. కాయలు తొందరగా పండిపోయి మెత్తగా మారి నీరు కారినట్లు అవుతాయి. ఈ మచ్చల వల్ల పండ్లు నాణ్యత కోల్పోయి మార్కెట్లో పంటకు సరైన ధర దక్కదు.
News September 19, 2025
23 సీట్లే వచ్చినా చంద్రబాబు అసెంబ్లీకి వచ్చారు: పల్లా

AP: అసెంబ్లీలో ప్రతిపక్షం లేకపోవడం బాధగానే ఉందని TDP రాష్ట్ర అధ్యక్షుడు పల్లా శ్రీనివాస రావు అన్నారు. జగన్ ప్రజా తీర్పును గౌరవించాలని, ఎమ్మెల్యేల సంఖ్య ముఖ్యం కాదని చెప్పారు. ఎమ్మెల్యేల బలం లేకపోయినా ప్రతిపక్ష హోదా ఇవ్వాలనడం సరికాదన్నారు. 2019లో 23 సీట్లే వచ్చినా చంద్రబాబు అసెంబ్లీకి వచ్చారని తెలిపారు. అసెంబ్లీలో మాట్లాడకుండా ప్రెస్మీట్లలో మాట్లాడతామనడం సరికాదని హితవు పలికారు.