News December 24, 2024

మనూ చాలా బాధపడింది: తండ్రి రామ్ కిషన్

image

భారత షూటర్ మనూ భాకర్‌ను ఖేల్‌ర‌త్నకు నామినేట్ <<14958848>>చేయకపోవడంపై<<>> ఆమె తండ్రి రామ్ కిషన్ స్పందించారు. ‘ఆమెను షూటింగ్‌ క్రీడాకారిణికి బదులుగా క్రికెటర్‌ని చేసి ఉండాల్సింది. ఒలింపిక్స్‌లో ఎవరూ సాధించని రికార్డును నెలకొల్పింది. నా బిడ్డ దేశం కోసం ఇంకా ఏమి చేయాలని మీరు ఆశిస్తున్నారు? దీనిపై మనూ కూడా బాధపడింది. తాను ఒలింపిక్స్‌కు వెళ్లి దేశం కోసం పతకాలు సాధించకపోవాల్సిందని ఆవేదన వ్యక్తం చేసింది’ అని తెలిపారు.

Similar News

News November 14, 2025

కమలం జోరు.. కాంగ్రెస్ బేజారు!

image

బిహార్‌ అసెంబ్లీ ఎన్నికల్లో BJP దూసుకెళ్తోంది. JDUతో కలిసి బరిలోకి దిగిన కాషాయ పార్టీ 95 సీట్లలో పూర్తి ఆధిపత్యం కొనసాగిస్తోంది. 2020 ఎన్నికల్లో ఆ పార్టీ 74 స్థానాలు గెలవగా ఇప్పుడు ఆ సంఖ్యను భారీగా పెంచుకుంటోంది. అటు ఆర్జేడీతో కలిసి పోటీ చేసిన కాంగ్రెస్ బోల్తా పడింది. కేవలం 3 చోట్లే ఆధిక్యంలో ఉంది. గత ఎలక్షన్స్‌లో హస్తం పార్టీ 19 సీట్లు గెలవగా ఇప్పుడు మరింత దిగజారింది.

News November 14, 2025

చనిపోయిన అభ్యర్థికి ఎన్ని ఓట్లు వచ్చాయంటే?

image

TG: జూబ్లీహిల్స్ ఉపఎన్నికలో పోటీ చేసిన నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి మహ్మద్ అన్వర్ నిన్న రాత్రి మరణించిన విషయం తెలిసిందే. తాజాగా పూర్తయిన కౌంటింగ్‌లో ఆయనకు 24 ఓట్లు వచ్చాయి. 924 ఓట్లతో NOTA 4వ స్థానంలో నిలిచింది. అటు ఇండిపెండెంట్ అభ్యర్థి రాథోడ్ రవీందర్ నాయక్‌కు అత్యల్పంగా 9 ఓట్లు పడ్డాయి. కాగా ఈ ఉపఎన్నికలో కాంగ్రెస్ అభ్యర్థి నవీన్ యాదవ్ విజయం సాధించారు.

News November 14, 2025

చిరాగ్ పాస్వాన్: పడి లేచిన కెరటం!

image

సరిగ్గా ఐదేళ్ల కిందట దారుణ పరాజయాన్ని చవిచూశారు LJP అధినేత చిరాగ్ పాస్వాన్. 2020 బిహార్ అసెంబ్లీ ఎన్నికల్లో 130కి పైగా సీట్లలో పోటీ చేసి కేవలం ఒకేఒక స్థానంలో గెలిచారు. బాబాయ్‌తో వివాదాలు, 2021లో పార్టీలో చీలిక తర్వాత తట్టుకుని నిలబడ్డారు. 2024 లోక్‌సభ ఎన్నికల్లో NDAతో పొత్తులో భాగంగా పోటీ చేసిన 5 చోట్లా గెలిచి పట్టు నిలుపుకున్నారు. తాజాగా 29 స్థానాల్లో పోటీ చేసి 21 చోట్ల లీడింగ్‌లో ఉన్నారు.