News July 27, 2024
10M ఎయిర్ పిస్టల్ ఫైనల్‌కు మనుభాకర్

పారిస్ ఒలింపిక్స్ మహిళల 10 మీటర్ల ఎయిర్ ఫిస్టల్ క్వాలిఫయర్స్‌లో మను భాకర్ అదరగొట్టారు. 580 పాయింట్లతో 3వ స్థానంలో నిలిచారు. పతక పోటీకి అర్హత సాధించారు. కొన్ని సిరీసుల్లో అమేజింగ్ ఫైరింగ్‌తో ఆకట్టుకున్న ఆమె ప్రత్యర్థులకు చెమటలు పట్టించారు. ఒకానొక దశలో రెండో ప్లేస్‌కు చేరుకున్నారు. ఆఖర్లో కాస్త తడబడటంతో ర్యాంకు తగ్గిపోయింది. రిథమ్ సంగ్వాన్ తొలుత అదరగొట్టినా అర్హత సాధించలేకపోయారు. #Olympics2024
Similar News
News October 15, 2025
లిక్కర్ స్కాం కేసు.. చెవిరెడ్డికి స్వల్ప ఊరట

ఏపీ లిక్కర్ స్కాం కేసులో వైసీపీ నేత చెవిరెడ్డి భాస్కర్ రెడ్డికి స్వల్ప ఊరట లభించింది. మిగతా నిందితులతో సంబంధం లేకుండా ఆయన బెయిల్‌పై నిర్ణయం తీసుకోవాలని ట్రయల్ కోర్టును సుప్రీంకోర్టు ఆదేశించింది. ఈ కేసులో మిథున్ రెడ్డి బెయిల్‌పై తుది నిర్ణయం తీసుకునేంతవరకు ట్రయల్ కోర్టు మిగతా వారి బెయిల్ పిటిషన్లపై నిర్ణయం తీసుకోవద్దన్న హైకోర్టు తీర్పును చెవిరెడ్డి సుప్రీంలో సవాల్ చేశారు.
News October 15, 2025
భారీగా తగ్గిన IPL విలువ

ఇండియన్ ప్రీమియర్ లీగ్(IPL) విలువ వరుసగా రెండో ఏడాది పడిపోయింది. 2023లో రూ.93,500 కోట్లున్న వాల్యూ 2024 సీజన్ నాటికి రూ.82,700కు తగ్గింది. 2025లో మరో రూ.6,600 కోట్లు తగ్గి రూ.76,100 కోట్లకు పడిపోయింది. గతేడాదితో పోల్చితే 8% డ్రాప్ నమోదైంది. స్పాన్సర్స్‌గా ఉన్న బెట్టింగ్ యాప్స్ బ్యాన్ అవడం, TVని డిజిటల్ మీడియా ఓవర్టేక్ చేయడం తదితర అంశాలు ఇందుకు కారణాలు.
News October 15, 2025
జూబ్లీహిల్స్ బీజేపీ అభ్యర్థిగా దీపక్ రెడ్డి

TG: జూబ్లీహిల్స్ ఉపఎన్నికకు బీజేపీ అభ్యర్థిగా లంకల దీపక్ రెడ్డి పేరు ఖరారైంది. కీర్తీ రెడ్డి, పద్మా వీరపునేని, ఆలపాటి లక్ష్మీనారాయణ, ఆకుల విజయ, కొంపల్లి మాధవి టికెట్ కోసం పోటీ పడ్డా చివరికి దీపక్ వైపే అధిష్ఠానం మొగ్గు చూపింది. కాగా 2023 ఎన్నికల్లోనూ దీపక్ బీజేపీ అభ్యర్థిగా పోటీ చేశారు. ప్రస్తుతం ఆయన హైదరాబాద్ సెంట్రల్ జిల్లా అధ్యక్షుడిగా ఉన్నారు.