News September 30, 2024

10 కోట్ల కార్ల తయారీ.. హ్యుందాయ్ ఘనత

image

సౌత్ కొరియా కంపెనీ హ్యుందాయ్ మోటార్స్ అరుదైన ఘనత సాధించింది. ప్రపంచవ్యాప్తంగా 10 కోట్ల కార్లను తయారుచేసిన సంస్థగా నిలిచింది. ద.కొరియాలోని ఉల్సాన్ ప్లాంట్‌లో రికార్డు బ్రేకింగ్ కారును కస్టమర్‌కు అప్పగించింది. 1968లో కార్యకలాపాలను ప్రారంభించిన ఈ సంస్థ 57 ఏళ్లలో భారత్ సహా 10 దేశాల్లో 12 ప్లాంట్‌లను ఏర్పాటుచేసింది. సవాళ్లను ఎదుర్కొని నూతన ఆవిష్కరణలు చేయడంతోనే వృద్ధి సాధ్యమైందని CEO జేహూన్ తెలిపారు.

Similar News

News November 24, 2025

32,438 పోస్టులు.. అడ్మిట్ కార్డులు విడుదల

image

RRB గ్రూప్-D పరీక్షలకు సంబంధించిన అడ్మిట్ కార్డులు విడుదలయ్యాయి. <>https://www.rrbcdg.gov.in/<<>>లో అభ్యర్థి రిజిస్ట్రేషన్ నంబర్, డేట్ ఆఫ్ బర్త్ ఎంటర్ చేసి హాల్‌టికెట్లను డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. 32,438 పోస్టులకు ఈ నెల 27 నుంచి 2026 జనవరి 16 వరకు ఎగ్జామ్స్ జరగనున్నాయి. ఇప్పటికే ఎగ్జామ్ సిటీ, డేట్ వివరాలు వెబ్‌సైట్‌లో అందుబాటులో ఉన్నాయి.

News November 24, 2025

ఈ డిగ్రీ ఉంటే జాబ్ గ్యారంటీ!

image

కంప్యూటర్ సైన్స్ డిగ్రీ హోల్డర్లకే వచ్చే ఏడాది ఎక్కువ ఉద్యోగావకాశాలు ఉన్నట్లు ఇండియా స్కిల్స్ రిపోర్టు-2026 వెల్లడించింది. వారిలో ఎంప్లాయిబిలిటీ రేటు 80%గా ఉన్నట్లు తెలిపింది. ఆ తర్వాతి స్థానాల్లో IT(78%), B.E/B.Tech(70%), MBA(72.76%), కామర్స్(62.81%), నాన్ IT సైన్స్(61%), ఆర్ట్స్(55.55%), ITI-ఒకేషనల్(45.95%), పాలిటెక్నిక్(32.92%) ఉన్నట్లు అంచనా వేసింది. డిగ్రీతోపాటు స్కిల్స్ ముఖ్యమని పేర్కొంది.

News November 24, 2025

కాపర్ టి-రకాలు

image

అవాంఛిత గర్భధారణను నివారించడానికి డాక్టర్లు కాపర్ టిని సూచిస్తారు. దీంట్లో రెండు రకాలున్నాయి. ఒకటి హార్మోనల్, మరొకటి నాన్ హార్మోనల్. హార్మోన్ కాపర్-టిలో లెవోనార్జెస్ట్రెల్ అనే హార్మోన్‌ విడుదలై శుక్రకణాలు అండం వద్దకు చేరకుండా ఆపుతుంది. నాన్ హార్మోనల్ కాపర్ టి రాగి అయాన్‌లను విడుదల చేస్తుంది. ఇవి శుక్రకణాలను, అండాలను నాశనం చేస్తాయి. వైద్యుల సలహాతో మీకు ఏది సరిపోతుందో తెలుసుకొని వాడటం మంచిది.