News May 4, 2024

వేసవిలో సబ్జా గింజలతో ఎన్నో ప్రయోజనాలు

image

✔ సబ్జా గింజలను రాత్రంతా నానబెట్టి నీరు/మజ్జిగ/జ్యూస్‌లలో కలుపుకుని తాగొచ్చు.
✔ వీటిలో ఫైబర్, ప్రొటీన్, విటమిన్-K, క్యాల్షియం, మెగ్నీషియం, ఐరన్, పొటాషియం, యాంటీఆక్సిడెంట్స్ ఉంటాయి.
✔ ఇవి ఒత్తిడిని తగ్గిస్తాయి. బాడీలోని వేడిని తగ్గించి కూల్ చేస్తాయి. ఆహార అరుగుదలకు ఉపయోగపడతాయి.
✔ శరీరానికి తక్షణ శక్తి లభిస్తుంది. బరువు నియంత్రణలో ఉంటుంది. అసిడిటీ సమస్యలు తగ్గుతాయి. రోగ నిరోధక శక్తి పెరుగుతుంది.

Similar News

News December 1, 2025

పోలవరం ఆలోపే పూర్తి చేస్తాం: CM

image

పోలవరం ప్రాజెక్టు రాష్ట్ర ప్రజల చిరకాల వాంఛ అని, ఆ ప్రాజెక్టు మనకు ఓ గేమ్ ఛేంజర్ అవుతుందని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు అన్నారు. సోమవారం ఉంగుటూరు మండలం నల్లమాడులో జరిగిన సభలో ఆయన మాట్లాడారు. 2027 నాటికి గోదావరి పుష్కరాలకు ముందే పోలవరం పూర్తి చేసి జాతికి అంకితం చేస్తామన్నారు. పోలవరం ప్రాజెక్ట్ నిర్మాణంతో గోదావరి, కృష్ణా డెల్టాలో నీటి ఎద్దడి సమస్యే ఉండదన్నారు.

News December 1, 2025

ఢిల్లీకి మంత్రి లోకేశ్.. రేపు కేంద్ర మంత్రులతో భేటీ

image

AP: మంత్రులు నారా లోకేశ్, వంగలపూడి అనిత ఢిల్లీ వెళ్లారు. వారికి కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు, ఎంపీలు స్వాగతం పలికారు. రేపు పార్లమెంట్‌లో కేంద్ర మంత్రులు అమిత్ షా, శివరాజ్ సింగ్ చౌహాన్‌తో లోకేశ్, అనిత భేటీ కానున్నారు. మొంథా తుఫాను ప్రభావం వల్ల జరిగిన నష్టం అంచనా రిపోర్టును వారికి అందిస్తారు.

News December 1, 2025

దిగ్గజ టెన్నిస్ ప్లేయర్ కన్నుమూత

image

ఇటలీకి చెందిన దిగ్గజ టెన్నిస్ ప్లేయర్, రెండుసార్లు ఫ్రెంచ్ ఓపెన్ విజేత నికోలా పియట్రాంగెలీ(92) కన్నుమూశారు. ఈ విషయాన్ని ఇటలీ టెన్నిస్ ఫెడరేషన్ ధ్రువీకరించింది. ప్రపంచ టెన్నిస్ హాల్ ఆఫ్ ఫేమ్‌లో ఇటలీ నుంచి చోటు దక్కించుకున్న ఏకైక ప్లేయర్ నికోలానే కావడం విశేషం. తన కెరీర్‌లో 44 సింగిల్స్ టైటిళ్లను గెలుచుకున్నారు. ఆయన తండ్రి ఇటలీకి చెందిన వ్యక్తి కాగా తల్లి రష్యన్. నికోలా 1933లో జన్మించారు.