News January 15, 2025
ధూమపానం, మద్యపానం, అధిక బరువుతో అనేక క్యాన్సర్లు!

ధూమపానం, మద్యపానానికి బానిసలై ఎంతో మంది ప్రాణాలు కోల్పోతున్నారు. మద్యం సేవించడాన్ని మానేస్తే క్యాన్సర్ను నివారించవచ్చని వైద్యులు సూచిస్తున్నారు. అధిక బరువు వల్ల 13 రకాల క్యాన్సర్లు, స్మోకింగ్ వల్ల ఏ భాగంలోనైనా క్యాన్సర్ రావొచ్చని తెలిపారు. ఆల్కహాల్ వల్ల స్వరపేటిక, అన్నవాహిక, కాలేయం, పెద్దపేగు క్యాన్సర్ వస్తుంది. అందుకే వీటిని మానేసి పౌష్టికాహారం తీసుకుంటే క్యాన్సర్ దరిచేరదంటున్నారు.
Similar News
News October 13, 2025
ఇండియన్ ఆర్మీ DG EMEలో 69 పోస్టులు

ఇండియన్ ఆర్మీ డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ ఎలక్ట్రానిక్స్ అండ్ మెకానికల్ ఇంజినీర్స్( DG EME)69 పోస్టులకు నోటిఫికేషన్ విడుదల చేసింది. అర్హతగల అభ్యర్థులు నవంబర్ 15వరకు అప్లై చేసుకోవచ్చు. జూనియర్ టెక్నికల్ ట్రైనింగ్ ఇన్స్ట్రక్టర్, స్టెనోగ్రాఫర్, LDC, MTS, దోబీ పోస్టులు ఉన్నాయి. పోస్టును బట్టి టెన్త్, ఇంటర్, డిగ్రీ, డిప్లొమా ఉత్తీర్ణత సాధించి ఉండాలి. వెబ్సైట్: https://www.indianarmy.nic.in.
News October 13, 2025
ప్రధాని మోదీతో సీఎం చంద్రబాబు భేటీ

ఢిల్లీలో ప్రధాని మోదీతో ఏపీ సీఎం చంద్రబాబు భేటీ అయ్యారు. విశాఖలో పెట్టుబడుల సదస్సుకు రావాలని ఆయన్ను ఆహ్వానించారు. చంద్రబాబు వెంట కేంద్రమంత్రులు రామ్మోహన్ నాయుడు, పెమ్మసాని చంద్రశేఖర్, ఎంపీ లావు శ్రీకృష్ణదేవరాయలు ఉన్నారు.
News October 13, 2025
వర్జ్యం అంటే ఏంటి?

వర్జ్యం అనేది విడువదగిన, అశుభ సమయం. దీన్ని నక్షత్రాన్ని బట్టి నిర్ణయిస్తారు. ప్రతి నక్షత్రంలో సుమారు 96 నిమిషాల వర్జ్యం ఉంటుంది. ఈ సమయంలో శుభకార్యాలు, ప్రయాణాలు మొదలుపెట్టకూడదు. జాతకంలో గ్రహాలు వర్జ్య కాలంలో ఉంటే ఆ దశలలో ఇబ్బందులు కలుగుతాయి. వర్జ్యంలో దైవారాధన చేయవచ్చు. దానం చేస్తే దోషాలు పోతాయని శాస్త్రం చెబుతోంది.
☞ రోజువారీ వర్జ్యాలు, ముహుర్తాల ఘడియల కోసం <<-se_10009>>పంచాంగం<<>> కేటగిరీకి వెళ్లండి.