News August 19, 2024

ఎన్నో అనుమానాలు..! (2/2)

image

ట్రైనీ డాక్టర్‌పై హ‌త్యాచారం ఘ‌ట‌న జరిగాక ఆస్పత్రికి వచ్చిన బాధితురాలి తల్లిదండ్రులను 3 గంటలపాటు నిరీక్షింపజేయ‌డం, పోస్టుమార్టం తరువాత హడావుడిగా దహనం చేయడం అనుమానాలకు తావిచ్చింది. ఈ ఘటనలో అనేక మంది ప్రమేయం ఉందని, అందుకే బెంగాల్ ప్రభుత్వం ఏదో దాస్తోందన్న విమర్శలు వెల్లువెత్తాయి. దీనిపై సొంత పార్టీ నేతలు, ప్రజల నిరసనలతో TMC ఉక్కిరిబిక్కిరి అవుతోంది.

Similar News

News January 16, 2026

మెగ్నీషియంతో జుట్టుకు మేలు

image

వయసుతో సంబంధం లేకుండా అందర్నీ వేధిస్తున్న సమస్య జుట్టు రాలడం. దీనికోసం పైపైన ఎన్ని షాంపూలు, నూనెలు వాడినా ఉపయోగం ఉండదంటున్నారు నిపుణులు. మెగ్నీషియం లోపం వల్ల మాడుకు రక్త ప్రసరణ తగ్గడంతో పోషకాలు అందక జుట్టు సమస్యలు వస్తాయి. పాలకూర, గుమ్మడి గింజలు, బాదం, అవిసెగింజలు, చియా, బీన్స్‌, చిక్కుళ్లు, అరటి, జామ,కివీ, బొప్పాయి, ఖర్జూరాలు, అవకాడో వంటివి ఆహారంలో చేర్చుకోవాలని సూచిస్తున్నారు.

News January 16, 2026

ప్రభాస్ ‘స్పిరిట్’ రిలీజ్ డేట్ వచ్చేసింది

image

పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ హీరోగా సందీప్ రెడ్డి వంగా తెరకెక్కిస్తోన్న ‘స్పిరిట్’ సినిమా రిలీజ్ డేట్‌ను మేకర్స్ ప్రకటించారు. ఈ చిత్రాన్ని 2027 మార్చి 5న విడుదల చేస్తామని తెలిపారు. ప్రపంచవ్యాప్తంగా మొత్తం 8 భాషల్లో రిలీజ్ కానున్నట్లు వెల్లడించారు. కాగా ఇప్పటికే రిలీజైన ఫస్ట్ లుక్ ఈ సినిమాపై భారీ అంచనాలు పెంచిన విషయం తెలిసిందే.

News January 16, 2026

గాదె ఇన్నయ్యకు 48 గంటల బెయిల్

image

TG: ఉపా కేసులో అరెస్టైన మాజీ మావోయిస్టు గాదె ఇన్నయ్యకు బెయిల్ లభించింది. తన తల్లి అంత్యక్రియల్లో పాల్గొనేందుకు నాంపల్లి NIA కోర్టు 48 గంటల బెయిల్ మంజూరు చేసింది. HYDలోని చంచల్‌గూడ జైలు నుంచి ఆయన విడుదలయ్యారు. నిన్న రాత్రి ఇన్నయ్య తల్లి థెరిసమ్మ జనగామ జిల్లా జఫర్‌గఢ్‌లో కన్నుమూశారు. రేపు ఆమె అంత్యక్రియలు జరగనున్నట్లు సమాచారం.