News November 8, 2024
రెండేళ్ల పదవీకాలంలో ఎన్నో కీలక తీర్పులు

50వ CJIగా జస్టిస్ DY చంద్రచూడ్ రెండేళ్ల పదవీకాలంలో ఎన్నో కీలక తీర్పులిచ్చారు. *అయోధ్య రామ మందిరం కేసులో తీర్పు ఇచ్చిన న్యాయమూర్తుల్లో ఒకరు *JKలో ఆర్టికల్ 370 రద్దు సమర్థన *వ్యక్తిగత గోప్యత అనేది ప్రాథమిక హక్కు *శబరిమల ఆలయంలో మహిళలకు ఎంట్రీ *ఏకాభిప్రాయ స్వలింగ సంపర్కానికి చట్టబద్ధత *వివాహంలో భార్యకు లైంగిక హక్కు ఉందని, బలవంతపు సంబంధాన్ని నేరంగా పరిగణిస్తూ తీర్పు ఇచ్చారు.
Similar News
News November 26, 2025
ఈ రెస్టారెంట్లో సింగిల్స్కు నో ఎంట్రీ!

దక్షిణ కొరియాలోని యోసు సిటీలోని ఓ రెస్టారెంట్ ఒంటరిగా వచ్చే వారికి అనుమతి లేదని ప్రకటించడం వివాదానికి దారితీసింది. సింగిల్ కస్టమర్లు ఇద్దరికి భోజనం కొనాలని లేదా ఫ్రెండ్/భార్యతో రావాలంటూ నిబంధనలు పెట్టింది. కొంతకాలంగా కొరియాలో “హోన్బాప్” అనే పేరుతో ఒంటరిగా తినే ట్రెండ్ పెరుగుతోంది. ఒంటరిగా తినడం ఒంటరితనం కాదని పలువురు అభిప్రాయపడుతుండగా, కొందరు ఈ నిర్ణయాన్ని సపోర్టు చేస్తున్నారు.
News November 26, 2025
బెట్టింగ్లతో అప్పులు.. గన్ తాకట్టు పెట్టిన ఎస్ఐ!

TG: హైదరాబాద్ అంబర్పేట్ SI గన్ మిస్సింగ్ వ్యవహారం కలకలం రేపింది. ఓ కేసులో రికవరీ చేసిన బంగారంతోపాటు తన సర్వీస్ గన్ను SI భాను ప్రకాశ్ తాకట్టు పెట్టినట్లు తెలుస్తోంది. భారీగా అప్పులు చేశారని, బెట్టింగ్లో రూ.80 లక్షలు పోగొట్టుకున్నారని సమాచారం. ఈ నేపథ్యంలోనే బంగారం, తుపాకీ తాకట్టు పెట్టారని పోలీసులు అనుమానిస్తున్నారు. ప్రస్తుతం భాను ప్రకాశ్ను టాస్క్ఫోర్స్ అదుపులోకి తీసుకుని విచారణ జరుపుతోంది.
News November 26, 2025
BELOPలో ఉద్యోగాలకు దరఖాస్తుల ఆహ్వానం

BEL ఆప్ట్రోనిక్ డివైసెస్ లిమిటెడ్(<


