News October 24, 2025
అయోడిన్ లోపంతో ఎన్నో సమస్యలు

అయోడిన్ మన జీవక్రియల్లో కీలకపాత్ర పోషిస్తుంది. థైరాయిడ్ గ్రంథి అయోడిన్‌ను గ్రహించి, దాన్ని థైరాయిడ్ హార్మోన్లుగా మారుస్తుంది. ఇది తగ్గితే శరీర ఉష్ణోగ్రత, చురుకుదనం, శ్వాస, గుండెవేగం, జీవక్రియ దెబ్బతింటాయి. అయోడిన్ లోపిస్తే గాయిటర్, రొమ్ముల్లో క్యాన్సర్ రహిత గడ్డలు ఏర్పడతాయి. చేపలు, సముద్ర ఆహారం, పాలు, గుడ్లు, సోయా ఉత్పత్తుల్లో అయోడిన్ ఉంటుందని నిపుణులు చెబుతున్నారు.
Similar News
News February 9, 2026
ఆకాశంలో టాక్సీలు.. బిల్డింగ్‌లపైనే ల్యాండింగ్: CII ప్రతిపాదన

గురుగ్రామ్, నోయిడా ఎయిర్‌పోర్ట్ మధ్య ‘ఎయిర్ టాక్సీలు’ నడపాలని CII ప్రతిపాదించింది. గంటల ప్రయాణం నిమిషాల్లోనే ముగిసేలా ఆఫీసులు, హాస్పిటల్స్, కమర్షియల్ బిల్డింగ్‌లపైనే ల్యాండింగ్ ప్యాడ్లు ఏర్పాటు చేయనున్నారు. ఫస్ట్ ఫేజ్‌లో ఆర్గాన్ ట్రాన్స్‌పోర్ట్ కోసం వీటిని వాడతారట. మెట్రో స్టేషన్లు, బిజినెస్ హబ్‌లను కలుపుతూ ఈ నెట్‌వర్క్ రాబోతోంది.
News February 9, 2026
పిల్లల్లో ఆకలి ఎందుకు తగ్గుతుందంటే?

పిల్లల్లో వయసుకు తగిన ఎదుగుదల లేకపోవడం, పాలు ఎక్కువగా తాగడం, చిరుతిళ్లు తినడం, నులిపురుగులు, ఐరన్ డెఫిషియన్సీ వల్ల ఆకలి తగ్గుతుందని నిపుణులు చెబుతున్నారు. పిల్లలకు మంచి పౌష్టికాహారం, పండ్లు, సూప్స్ పెట్టాలి. జంక్ ఫుడ్ చిన్నప్పటి నుంచే అలవాటు చేస్తే ఊబకాయం, అనారోగ్యాలు వస్తాయి. ఫోన్లు, టీవీ చూపించి అన్నం పెట్టొద్దు. దీనితో అర్టిజం, హైపర్ యాక్టివ్ సమస్యలు వచ్చే అవకాశం ఉందని హెచ్చరిస్తున్నారు.
News February 9, 2026
ఎండిన మామిడి ఆకులు తోరణాలుగా ఉండకూడదా?

ఎండిన మామిడి ఆకులు గుమ్మానికి ఉండటం అశుభంగా భావిస్తారు. అవి నల్లగా మారినా వెంటనే తొలగించాలి. లేకపోతే లక్ష్మీదేవి ఆగ్రహానికి గురవుతుందని నమ్ముతారు. ఇంట్లో ప్రతికూలత ఏర్పడే అవకాశం ఉంటుందట. అందుకే ఎండిన తోరణాలను తొలగించి అవసరమైతే మూలా నక్షత్రం రోజున, ఇతర శుభ ముహూర్తాల్లో కొత్త పచ్చని మామిడి ఆకులను కట్టాలని సూచిస్తున్నారు. ఇలా చేస్తే ఇంటికి సానుకూల శక్తి చేకూరి లక్ష్మీ కటాక్షం సిద్ధిస్తుంది.


