News July 5, 2024
మీ ప్రేమకు చాలా థ్యాంక్స్: సూర్య కుమార్

ముంబై మెరైన్ డ్రైవ్ నుంచి వాంఖడే స్టేడియం వరకు సాగిన ‘విక్టరీ పరేడ్’ గురించి స్టార్ క్రికెటర్ సూర్యకుమార్ యాదవ్ స్పందించారు. ‘నిన్నటి సాయంత్రాన్ని ఎప్పటికీ మరిచిపోలేను. మా చుట్టూ ఉన్నవారిలో సంతోషం, భావోద్వేగాలు, వేడుకలు చూస్తే అంతా కలగా అనిపించింది. మీరు చూపిన ప్రేమకు చాలా థ్యాంక్స్. ఇది చూస్తే అర్థమవుతోంది మీకు ఈ కప్ అంటే ఎంత ఇష్టమో. ఈ కప్ మీ అందరికీ చెందినది’ అని ట్వీట్ చేశారు.
Similar News
News October 22, 2025
నవీన్, సునీత నామినేషన్లకు ఆమోదం

TG: జూబ్లీహిల్స్ ఉపఎన్నికలో కాంగ్రెస్, బీఆర్ఎస్ అభ్యర్థులు నవీన్ యాదవ్, మాగంటి సునీత నామినేషన్లు ఆమోదం పొందాయి. తన నామినేషన్పై బీఆర్ఎస్ తప్పుడు అభ్యంతరాలు వ్యక్తం చేసిందని నవీన్ తెలిపారు. అన్నీ సక్రమంగా ఉండటంతో ఆర్వో ఆమోదించినట్లు చెప్పారు. తాను మాత్రం ఎవరి నామినేషన్పై అభ్యంతరం చేయలేదని వెల్లడించారు. జూబ్లీహిల్స్ ఉపఎన్నికలో భారీగా నామినేషన్లు దాఖలు కావడంతో స్క్రూటినీకి మరింత సమయం పట్టనుంది.
News October 22, 2025
పట్టణాలు, నగరాల్లో ఇక కామన్ జోనింగ్ విధానం

AP: రాష్ట్రంలోని పట్టణాలు, నగరాల్లో జోనింగ్ నిబంధనలు ఒకేమాదిరి కాకుండా వేర్వేరుగా ఉన్నాయి. దీనివల్ల లైసెన్సులు, నిర్మాణ అనుమతులు ఇతర అంశాలలో సమస్యలు ఎదురవుతున్నాయి. దీని నివారణకు ప్రభుత్వం కామన్ జోనింగ్ విధానాన్ని ప్రవేశపెడుతూ తాజాగా <
News October 22, 2025
రానున్న 5 రోజులు పిడుగులతో కూడిన వర్షాలు!

AP: నైరుతి బంగాళాఖాతంలో తీవ్ర అల్పపీడనం వల్ల రేపు ప్రకాశం, నెల్లూరు, చిత్తూరు, తిరుపతి జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని APSDMA తెలిపింది. రానున్న 5 రోజులు రాష్ట్రంలో విస్తృతంగా పిడుగులతో కూడిన వర్షాలు పడే అవకాశం ఉందని పేర్కొంది. తీరం వెంబడి 35-55km/h వేగంతో ఈదురుగాలులు వీచే ఛాన్స్ ఉందని, ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించింది. శనివారం వరకు జాలర్లు వేటకు వెళ్లొద్దని హెచ్చరించింది.