News December 2, 2024
మావోల ఎన్కౌంటర్.. మృతదేహాలను భద్రపరచాలని కోర్టు ఆదేశం

TG: ఏటూరు నాగారం ఎన్కౌంటర్లో హతమైన మావోయిస్టుల మృతదేహాలను రేపటి వరకు భద్రపరచాలని, మృతదేహాలను వారి కుటుంబ సభ్యులకు చూపించాలని హైకోర్టు ఆదేశించింది. ఇది బూటకపు ఎన్కౌంటర్ అని దాఖలైన పిటిషన్పై విచారణ జరిపింది. భోజనంలో మత్తు కలిపి, చిత్రహింసలకు గురిచేసి మావోలను చంపారని పిటిషనర్ తరఫు న్యాయవాది వాదించారు. మృతదేహాలపై గాయాలున్నాయన్నారు. వాదనల అనంతరం విచారణను కోర్టు రేపటికి వాయిదా వేసింది.
Similar News
News November 19, 2025
ఇంటర్మీడియట్ పరీక్షల్లో మార్పులు

AP: వచ్చే ఏడాది ఇంటర్ 1st ఇయర్ పరీక్షల్లో బుక్లెట్ పేజీలను 24నుంచి 32కు పెంచారు. మ్యాథ్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీ, హిస్టరీ, ఎకనామిక్స్, పొలిటికల్ సైన్స్, కామర్స్కు 32 పేజీలు ఉంటాయి. బయాలజీలో వృక్షశాస్త్రం, జంతుశాస్త్రానికి 24పేజీల చొప్పున 2 బుక్లెట్లు ఇస్తారు. భౌతిక, రసాయన, జీవశాస్త్ర పరీక్షలు 85 మార్కులకు పాస్ మార్క్స్ 29. కొన్ని సబ్జెక్టుల్లో 30% వచ్చినా, మొత్తం 35% ఉంటే పాస్గా పరిగణిస్తారు.
News November 19, 2025
ఇతిహాసాలు క్విజ్ – 71

ఈరోజు ప్రశ్న: గణేశుడు మహాభారతాన్ని రాసేటప్పుడు తన దంతాన్ని ఎందుకు విరిచాడు?
☛ పై ప్రశ్నకు సమాధానాన్ని సాయంత్రం ఆరు గంటలకు పబ్లిష్ చేస్తాం.
☛ మీకు జవాబు తెలిస్తే కామెంట్ రూపంలో తెలియజేయండి.
<<-se>>#Ithihasaluquiz<<>>
News November 19, 2025
ఉమెన్ డెవలప్మెంట్ & చైల్డ్ వెల్ఫేర్లో ఉద్యోగాలు

తిరుపతిలోని <


