News January 21, 2025
క్షేమంగానే మావోయిస్టు నేత దామోదర్!
TG: ములుగు జిల్లా తాడ్వాయికి చెందిన మావోయిస్టు రాష్ట్ర కమిటీ కార్యదర్శి బడే చొక్కారావు అలియాస్ దామోదర్ సురక్షితంగా ఉన్నట్లు తెలుస్తోంది. ఛత్తీస్‌గఢ్‌లో ఈ నెల 16న జరిగిన ఎన్‌కౌంటర్‌లో దామోదర్ చనిపోయినట్లు ఆ పార్టీ లేఖ విడుదల చేసింది. అయితే ఈ విషయాన్ని పోలీసులు ధ్రువీకరించలేదు. తాను క్షేమంగానే ఉన్నట్లు దామోదర్ కుటుంబీకులకు చేరవేసినట్లు సమాచారం. ఎన్‌కౌంటర్‌లో 16మంది మావోలు చనిపోయిన విషయం తెలిసిందే.
Similar News
News January 21, 2025
తండ్రి కాబోతున్న టాలీవుడ్ హీరో
టాలీవుడ్ యంగ్ హీరో కిరణ్ అబ్బవరం తండ్రి కాబోతున్నారు. తన భార్య బేబీ బంప్‌తో ఉన్న ఫొటోను సోషల్ మీడియాలో పంచుకున్న ఆయన ‘మా ప్రేమ 2 అడుగుల మేర పెరుగుతోంది’ అంటూ ట్వీట్ చేశారు. దీంతో అందరూ కిరణ్‌కు కంగ్రాట్స్ చెబుతున్నారు. కాగా తాను ప్రేమించిన హీరోయిన్ రహస్య గోరక్‌ను కిరణ్ గత ఆగస్టులో పెళ్లి చేసుకున్న సంగతి తెలిసిందే.
News January 21, 2025
Stock Markets: రియాల్టి షేర్లపై సెల్లింగ్ ప్రెజర్
గ్లోబల్ మార్కెట్ల నుంచి మిశ్రమ సంకేతాలే అందడంతో దేశీయ స్టాక్‌మార్కెట్లు ఫ్లాటుగా ట్రేడవుతున్నాయి. సెన్సెక్స్ 76942 (-130), నిఫ్టీ 23,346 (5) వద్ద కొనసాగుతున్నాయి. BRICS దేశాలపై 100% టారిఫ్ విధిస్తానని ట్రంప్ చెప్పడం నెగటివ్ సెంటిమెంటుకు దారితీసింది. మీడియా, మెటల్, ఫార్మా, హెల్త్‌కేర్, O&G షేర్లకు డిమాండ్ కనిపిస్తోంది. రియాల్టి షేర్లపై సెల్లింగ్ ప్రెజర్ ఉంది. BPCL, APOLLOHOSP టాప్ గెయినర్స్.
News January 21, 2025
ఫిబ్రవరిలోనే సర్పంచ్ ఎన్నికలు?
TG: సర్పంచ్ ఎన్నికలు ఫిబ్రవరిలోనే నిర్వహించేందుకు ప్రభుత్వం కసరత్తు చేస్తున్నట్లు తెలుస్తోంది. ఎన్నికల్లో బీసీ రిజర్వేషన్ల పెంపుపై త్వరలో ప్రభుత్వానికి అందే నివేదికను అసెంబ్లీలో ఆమోదించాలని ఆలోచిస్తోంది. ఫిబ్రవరిలో నిర్వహించాల్సి వస్తే 15-20 రోజుల్లో ఎలక్షన్స్ పూర్తి చేయనుంది. మార్చిలో ఇంటర్, ఆ తర్వాత టెన్త్ పరీక్షలతో ఎన్నికల నిర్వహణకు ఇబ్బంది అవుతుంది. ఫిబ్రవరి కాకుంటే ఏప్రిల్ వరకు ఆగాల్సిందే.