News October 30, 2024

బీఆర్ఎస్, కాంగ్రెస్ నేతలకు మావోయిస్టు పార్టీ వార్నింగ్

image

TG: దళిత బంధు పేరుతో ప్రజలను జయశంకర్ భూపాలపల్లి బీఆర్ఎస్, కాంగ్రెస్ నేతలు మోసం చేశారని మావోయిస్టు పార్టీ అధికార ప్రతినిధి జగన్ పేరిట లేఖ విడుదల చేసింది. దళిత బంధు ఇస్తామని ప్రజల నుంచి రూ.లక్షల వసూళ్లకు పాల్పడినట్లు ఆరోపించింది. ఇప్పటికైనా వాటిని ప్రజలకు తిరిగి ఇచ్చేయాలని పలువురి పేర్లను పేర్కొంటూ డిమాండ్ చేసింది. లేకపోతే ప్రజల చేతిలో శిక్ష తప్పదని వార్నింగ్ ఇచ్చింది.

Similar News

News February 14, 2026

మున్సిపాలిటీల్లో హంగ్.. వీరి ఓట్లే కీలకం

image

TG: రాష్ట్రంలో సుమారు 40కు పైగా స్థానాల్లో హంగ్ సూచనలు ఉండటంతో ఎక్స్‌అఫీషియో ఓట్లు కీలకంగా మారనున్నాయి. మేయర్, ఛైర్‌పర్సన్, డిప్యూటీ మేయర్, వైస్ ఛైర్‌పర్సన్ ఎంపికలో MP, MLA, MLCలు ఓట్లు వేసే అవకాశం ఉంది. వీరు తమకు ఓటు ఉన్న జిల్లా పరిధిలోని ఏ మున్సిపాలిటీలోనైనా ఎక్స్‌అఫీషియో సభ్యుడి ఓటరుగా ఉండేందుకు ఛాన్స్ ఉంది. ఫలితాల ఆధారంగా ఓటు నమోదు చేసుకోనున్నారు. ఇవాళ నమోదుకు ఆఖరు తేదీ కావడం గమనార్హం.

News February 14, 2026

కరివేపాకుతో మెరిసే చర్మం

image

కరివేపాకులో యాంటీ ఆక్సిడెంట్లు, యాంటీ ఇన్ఫ్లమేటరీ లక్షణాలు, యాంటీమైక్రోబయల్ వంటి గుణాలు పుష్కలంగా ఉన్నాయి. ఇవి ఆరోగ్యానికి ఎంతో మేలు చేయడంతో పాటు, చర్మాన్ని మెరిసేలా చేస్తాయని నిపుణులంటున్నారు. * కరివేపాకు, పాలతో చేసిన పేస్ట్‌ను ముఖానికి అప్లై చేసుకోవడం వల్ల మచ్చలు, ముడతలు తగ్గుతాయి. * కరివేపాకు మరిగించిన నీళ్లలో కొద్దిగా శనగపిండి, నిమ్మరసం కలిపి కూడా ముఖానికి అప్లై చేస్తే చర్మం మెరుస్తుంది.

News February 14, 2026

జొన్న పంటలో కంకి నల్లిని ఎలా నివారించాలి?

image

జొన్న పంటలో గింజలు పాలు పోసుకునే దశలో పిల్ల, పెద్ద పురుగులు ఆశించి రసం పీల్చుతాయి. దీని వల్ల గింజలు నొక్కులుగా మారి కంకిలో తక్కువ గింజలు కలిగి ఉంటాయి. గింజల మీద ఎరుపు మచ్చలు ఏర్పడి అవి క్రమంగా నల్లగా మారతాయి. గింజలు గట్టిపడ్డాక ఈ పురుగు ఆశించదు. కంకి నల్లి నివారణకు పూత దశలో లీటరు నీటికి ప్రొఫెనోఫాస్ 2ML కలిపి 7 రోజుల వ్యవధిలో 2 సార్లు పిచికారీ చేయాలని వ్యవసాయ నిపుణులు సూచిస్తున్నారు.