News September 17, 2025

మావోయిస్టుల సంచలన ప్రకటన.. ఆయుధాలు వదిలేస్తామని లేఖ

image

తక్షణమే ఆపరేషన్ కగార్ నిలిపివేసి, ఎన్‌కౌంటర్లు ఆపితే ఆయుధాలు వదిలేస్తామని మావోయిస్టులు కేంద్ర హోంమంత్రి అమిత్ షాకు లేఖ రాశారు. CPI మావోయిస్టు అధికార ప్రతినిధి అభయ్ పేరిట ఈ స్టేట్‌మెంట్ రిలీజైంది. కాగా అమిత్ షా 2026 మార్చి లోపు భారత గడ్డపై మావోయిస్టులను ఉండనివ్వబోమని డెడ్‌లైన్ విధించిన విషయం తెలిసిందే. ఇది భద్రతా బలగాలకు అతిపెద్ద విజయం అని విశ్లేషకులు చెబుతున్నారు.

Similar News

News February 1, 2026

NZB: రాష్ట్ర స్థాయి సీనియర్ క్రికెట్ టోర్నీకి జిల్లా మహిళ జట్టు

image

తెలంగాణ రాష్ట్ర స్థాయి సీనియర్ మహిళ క్రికెట్ టోర్నీలో పాల్గొనే నిజామాబాద్ జిల్లా జట్టు ఖరారైనట్లు నిజామాబాద్ క్రికెట్ అసోసియేషన్ వెల్లడించింది. HCA ఆధ్వర్యంలో వరంగల్‌లో జరిగే రాష్ట్రస్థాయి సీనియర్ ఉమెన్ క్రికెట్ టోర్నీకి జిల్లా నుంచి 19 మంది క్రీడాకారిణులను ఎంపిక చేశారు. ఈనెల 2 నుంచి 7 వరకు వరంగల్‌లో జరిగే టోర్నీలో పాల్గొంటారు. అసోసియేషన్ అధ్యక్షుడు చంద్రసేన్ రెడ్డి వారిని అభినందిచారు.

News February 1, 2026

కేసీఆర్‌ను సిట్ అడిగిన ప్రశ్నలివే?

image

TG: ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో KCRను సిట్ కీలక ప్రశ్నలు అడిగినట్లు తెలుస్తోంది. ‘ఫోన్ ట్యాపింగ్ చేయమని ఇంటెలిజెన్స్ అధికారులను మీరే ఆదేశించారా? మీ పార్టీ MLAలు ఇతర పార్టీలకు వెళ్తున్నారని మీకు ఎలా తెలిసింది? ఎప్పటి నుంచి ప్రైవేటు వ్యక్తుల ఫోన్ల ట్యాప్ జరిగింది? ప్రతిపక్ష నాయకుల ఫోన్లు ట్యాప్ చేయమని మీరే కోరారా?’ అని ప్రశ్నించినట్లు సమాచారం. వీటికి KCR తనదైన శైలిలో సమాధానం ఇచ్చారని తెలుస్తోంది.

News February 1, 2026

8మంది MPలను ఇస్తే తిరిగిచ్చింది గుండు సున్నా: బడ్జెట్‌పై కవిత ఫైర్

image

TG: బడ్జెట్‌లో తెలంగాణకు మొండిచేయి ఎదురైందని జాగృతి అధ్యక్షురాలు కవిత మండిపడ్డారు. రాష్ట్రం నుంచి 8 మంది BJP MPలను ఇస్తే బదులుగా గుండుసున్నా ఇచ్చారని ఎద్దేవా చేశారు. ₹34,367 కోట్ల RRR, మెట్రో ఫేజ్-2 విస్తరణ నిధులు, బయ్యారం ఉక్కు ఫ్యాక్టరీ వంటి అంశాలను కేంద్రం విస్మరించిందన్నారు. వరంగల్ కోచ్ ఫ్యాక్టరీ, IIM వంటి కీలక డిమాండ్లను పట్టించుకోలేదన్నారు. కో-ఆపరేటివ్ ఫెడరలిజం అంటే ఇదేనా? అని ప్రశ్నించారు.