News February 4, 2025
అన్ని ఆఫీసుల్లో మరాఠీ తప్పనిసరి.. లేదంటే చర్యలు

మహారాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. అన్ని GOVT కార్యాలయాల్లో ఉద్యోగులంతా తప్పనిసరిగా మరాఠీలోనే మాట్లాడాలని ఆదేశాలు జారీ చేసింది. లేదంటే చర్యలు తీసుకుంటామని హెచ్చరించింది. మరాఠీ భాష పరిరక్షణ, అభివృద్ధి కోసం ప్రజా వ్యవహారాల్లో ఈ భాషను ఉపయోగించాలని ప్రభుత్వ కమిటీ సిఫారసు చేసింది. కంప్యూటర్ కీ బోర్డుల్లోనూ మరాఠీ దేవనాగరి లిపి ఉండాలని పేర్కొంది. ఆ మేరకు GOVT చర్యలు ప్రారంభించింది.
Similar News
News December 8, 2025
రేణిగుంటకు వస్తున్న అన్ని విమానాలు.!

‘ఇండిగో’ విమానాల సంక్షోభంతో దేశవ్యాప్తంగా పెద్ద ఎత్తన సర్వీసులు రద్దైన విషయం విషయం తెలిసిందే. ఈ ప్రభావం రేణిగుంటలో సైతం కనిపించంది. ఇండిగో నిత్యం తిరుపతికి 10-12 సర్వీసులను నడుపుతుంది. ఈ సంక్షోభంతో 6 వరకు విమానాలు రద్దయ్యాయి. ఆదివారం నుంచి పరిస్థితి కుదుట పడింది. దీంతో రేణిగుంటకు పూర్తి స్థాయిలో విమానాలు వస్తున్నట్లు అధికారులు తెలిపారు. టికెట్ ధరలు సైతం సాధారణ స్థాయికి చేరుకున్నాయి.
News December 8, 2025
రబీ వరి నాట్లు.. రైతులకు కీలక సూచనలు

వ్యవసాయ నిపుణుల సిఫారసు మేరకు ఎంపిక చేసుకున్న వరి రకాలకు చెందిన 21 రోజుల నారును సిద్ధం చేసిన పొలంలో మరీ లోతుగా కాకుండా పైపైన నాటుకోవాలి. నాట్లు వేసే ముందు నారు కొనలు తుంచడం వల్ల కాండం తొలుచు పురుగు గుడ్ల సముదాయాలు నాశనమవుతాయి. దీని వల్ల పురుగు ఉద్ధృతిని తగ్గించవచ్చు. నారుమడులలో, వెదజల్లే పొలాల్లో నవంబర్-డిసెంబరులో భారీ వర్షాలకు ఎక్కువ నీరు బయటకు పోవడానికి వీలుగా కాలువలను ఏర్పాటు చేసుకోవాలి.
News December 8, 2025
చలికాలంలో గర్భిణులు ఏం తినాలంటే?

వాతావరణం చల్లగా ఉండటం, జీర్ణ క్రియలు నెమ్మదిగా ఉండటం వల్ల ఈ కాలంలో పోషకాహార లోపం ఏర్పడుతుంది. గర్భిణుల్లో ఈ లోపం రాకుండా ఉండాలంటే డైట్లో కొన్ని ఆహారాలు చేర్చుకోవాలంటున్నారు నిపుణులు. ముఖ్యంగా ఆకుకూరలు, డ్రైఫ్రూట్స్, విటమిన్లు, ఫైబర్ రిచ్ ఫుడ్స్ తీసుకోవాలని సూచిస్తున్నారు. వీటికోసం చిలగడ దుంప, ఆరెంజ్, ద్రాక్ష, నిమ్మ, దానిమ్మ, రేగిపండ్లు వంటివి తినాలంటున్నారు.


