News March 16, 2025
మార్చి 16: చరిత్రలో ఈరోజు

*1764: తెలుగు భాష తొలి నిఘంటు కర్త మామిడి వెంకటాచార్యులు జననం * 1901: ప్రత్యేకాంధ్ర కోసం ఆమరణ నిరాహార దీక్ష చేసిన పొట్టి శ్రీరాములు జననం *1917 ఆంధ్రప్రదేశ్ మెుదటి లోకాయుక్త ఆవుల సాంబశివరావు జననం *1963: భారత దేశ రెండవ ప్రధాన న్యాయమూర్తి ఎం. పతంజలి శాస్త్రి మరణం * 1993: ముంబైలో బాంబు పేలుళ్లు *1995: జాతీయ టీకా దినోత్సవం
Similar News
News December 4, 2025
ఫ్లాట్‌లో రాత్రంతా అమ్మాయిలు.. బ్యాచిలర్లకు ఫైన్

బెంగళూరులో బ్యాచిలర్లకు వింత అనుభవం ఎదురైంది. ఫ్లాట్‌లో రాత్రంతా అమ్మాయిలు ఉన్నారని రెసిడెన్షియల్ సొసైటీ ₹5వేల ఫైన్ విధించింది. వారికి బిల్లు కూడా ఇచ్చింది. ‘అతిథులు రాత్రిపూట ఉండేందుకు బ్యాచిలర్లకు అనుమతి లేదని మా సొసైటీలో రూల్ ఉంది. ఫ్యామిలీలకు మాత్రం ఆ రూల్ లేదంట’ అని రెడిట్‌లో ఓ యూజర్ రాసుకొచ్చారు. వారిపై చర్యలు తీసుకోవచ్చా అని యూజర్లను అడిగారు. ఇంకో ఇంటికి మారడం మంచిదని నెటిజన్లు సూచించారు.
News December 4, 2025
179 పోస్టులు.. దరఖాస్తు చేశారా?

సెంట్రల్ అగ్రికల్చర్ యూనివర్సిటీ, ఇంపాల్‌లో 179 పోస్టులకు అప్లై చేయడానికి ఎల్లుండే ఆఖరు తేదీ. పోస్టును బట్టి సంబంధిత విభాగంలో PhD, పీజీ, NET ఉత్తీర్ణతతో పాటు బోధన/ రీసెర్చ్‌లో అనుభవం ఉండాలి. ప్రొఫెసర్‌కు నెలకు రూ.1,44,200, అసోసియేట్ ప్రొఫెసర్‌కు రూ.1,31,400, అసిస్టెంట్ ప్రొఫెసర్‌కు రూ.57,700 చెల్లిస్తారు. దరఖాస్తు ఫీజు రూ.1000, SC, ST, PWBD, మహిళలకు ఫీజు లేదు. వెబ్సైట్: https://cau.ac.in/
News December 4, 2025
దీపం కొండెక్కింది అని ఎందుకు అంటారు?

దీపం ఆరిపోవడాన్ని మనం ‘దీపం కొండెక్కింది’ అని అంటాం. దీని వెనుక ఓ ఆధ్యాత్మిక కారణం ఉంది. సాధారణంగా మనం పర్వతాలను దైవ నివాసాలుగా భావిస్తాం. కొండలు దేవతలకు ఆశ్రయం ఇస్తాయని నమ్ముతాం. అయితే, దీపం జ్యోతి ఆరిపోయినప్పుడు, అది భౌతిక దేహాన్ని విడిచి, నేరుగా దైవంలో కలిసిపోయింది అని భావించాలి. దీపం దైవంలో ఐక్యమైందని చెప్పడానికే మనం ఆధ్యాత్మిక వ్యక్తీకరణను ఉపయోగిస్తూ ఇలా చెబుతుంటాం.


