News March 18, 2025
మార్చి18 : చరిత్రలో ఈ రోజు

*1922: శాసనోల్లంఘన ఉద్యమం చేసినందుకు మహాత్మాగాంధీకి 6 సంవత్సరాల జైలుశిక్ష
*1938: బాలీవుడ్ నటుడు శశి కపూర్ జననం
*1953: ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ హోంశాఖ మంత్రి దేవేందర్ గౌడ్ జననం
*1965: అంతరిక్షంలో నడిచిన తొలి రోదసీ యాత్రికుడిగా అలెక్సీ లియనోవ్ రికార్డు
*1986: సినీనటుడు సుశాంత్ జననం
Similar News
News March 18, 2025
రేపు భూమిపై అడుగుపెట్టనున్న సునీతా విలియమ్స్

భారత సంతతి వ్యోమగామి సునీతా విలియమ్స్ రేపు భూమి మీదకు రానున్నారు. మరో ఆస్ట్రోనాట్ బుచ్ విల్మోర్‌తో కలిసి ఉదయం 3.27నిమిషాలకు భూమిపైకి చేరుకుంటారని నాసా ప్రకటించింది. వీరు ప్రయాణించే వ్యోమనౌక ఫ్లోరిడా తీరానికి చేరువలో గల సాగర జలాల్లో దిగుతుందని వివరించింది. భారత కాలమానం ప్రకారం ఈ రోజు ఉ. 8:15 గంటలకు వీరి యాత్ర ప్రారంభమవుతుంది. ఈ కార్యక్రమాన్ని నాసా ప్రత్యక్ష ప్రసారం చేయనుంది.
News March 18, 2025
తిరుమలలో పెరిగిన భక్తుల రద్దీ

AP: తిరుమలలో భక్తుల రద్దీ పెరిగింది. శ్రీవారి సర్వదర్శనానికి 12 గంటల సమయం పడుతోంది. స్వామి వారి దర్శనానికి 25 కంపార్టుమెంట్లలో భక్తులు వేచి ఉన్నారు. నిన్న 70,824 మంది భక్తులు దర్శించుకోగా 25,674 మంది భక్తులు తలనీలాలు సమర్పించుకున్నారు. అదే సమయంలో హుండీ ఆదాయం రూ.3.84 కోట్లు సమకూరింది.
News March 18, 2025
బీటెక్ ఫస్టియర్ రిజల్ట్.. 75% విద్యార్థులు ఫెయిల్!

TG: జేఎన్టీయూహెచ్ అనుబంధ కాలేజీల బీటెక్ ఫస్టియర్ సెమిస్టర్ ఫలితాల్లో 75 శాతం మంది కనీసం ఒక్క సబ్జెక్ట్ ఫెయిలయ్యారు. మొత్తం 40 వేల మంది విద్యార్థుల్లో 10వేల మంది(25%) మాత్రమే అన్ని సబ్జెక్టులూ పాసైనట్లు సమాచారం. అత్యధికంగా మ్యాథ్స్(M1), డ్రాయింగ్, ఫిజిక్స్ సబ్జెక్టుల్లో ఫెయిలయ్యారని తెలుస్తోంది. ఫస్ట్ సెమిస్టర్(రెగ్యులర్), రెండో సెమిస్టర్(సప్లిమెంటరీ) ఫలితాలు వెబ్‌సైట్‌లో ఉంచారు.