News March 22, 2024

మార్చి 22: చరిత్రలో ఈరోజు

image

1739 : నాదిర్ షా ఢిల్లీని ఆక్రమించి నెమలి సింహాసనాన్ని అపహరించాడు
2000: భారత కృత్రిమ ఉపగ్రహం ఇన్సాట్-3బి ప్రయోగం విజయవంతం
2005: తమిళ నటుడు జెమినీ గణేశన్ మరణం
2007: తత్వవేత్త ఉప్పులూరి గోపాలకృష్ణ మరణం
2009: తెలుగు సినీ నటుడు టి.ఎల్.కాంతారావు మరణం
ప్రపంచ జల దినోత్సవం

Similar News

News November 1, 2025

ఇంతమంది వస్తారని అనుకోలేదు: హరిముకుంద్

image

AP: శ్రీకాకుళం కాశీబుగ్గ వేంకటేశ్వరాలయంలో తొక్కిసలాటపై నిర్వాహకుడు 95 ఏళ్ల హరిముకుంద్ పండా స్పందించారు. ఇంతమంది భక్తులు వస్తారని ఊహించలేదని చెప్పారు. భక్తులు విపరీతంగా వచ్చారని, గతంలో ఎప్పుడూ ఇంతమంది రాలేదని తెలిపారు. కాగా గతంలో తిరుమలకు వెళ్లిన హరిముకుంద్‌కు సంతృప్తిగా స్వామివారి దర్శనం కలగలేదు. దీంతో తనకు గల 50 ఎకరాల్లో 10 ఎకరాల్లో ఆలయం నిర్మించారు.

News November 1, 2025

వేలానికి బంగారు టాయిలెట్.. ప్రారంభ ధర ₹83Cr!

image

బంగారంతో తయారుచేసిన టాయిలెట్ కమోడ్ వేలానికి సిద్ధమైంది. ఇటాలియన్ కళాకారుడు మౌరిజియో కాటెలాన్ ఈ విచిత్ర కళాఖండానికి ‘అమెరికా’ అని పేరు పెట్టారు. ధనవంతుల అహంకారం, వారి ఆర్భాటపు జీవితం ఎంత నిష్ఫలమో ఈ ‘గోల్డ్ టాయిలెట్’ ద్వారా సందేశం ఇస్తున్నట్లు సృష్టికర్త పేర్కొన్నారు. న్యూయార్క్‌లో నవంబర్ 18న వేలం జరగనుంది. ప్రారంభ ధర ₹83 కోట్లుగా నిర్ణయించారు.

News November 1, 2025

ఏకాదశి వ్రతం ఎలా పాటించాలి?

image

ఏకాదశి వ్రతం పాటించే భక్తులు ఆ రోజున ఉపవాసం ఉండాలి. విష్ణువును తులసి మాలలతో పూజించాలి. రాత్రంతా పురాణ శ్రవణం చేస్తూ, జాగరణ చేయాలి. మరుసటి రోజు ద్వాదశి ఘడియల్లో మళ్లీ విష్ణు పూజ చేసి, భోజనం స్వీకరించాలి. అలా వ్రతం ముగుస్తుంది. ఈ వ్రతాన్ని ఆచరిస్తే నారద పురాణం ప్రకారం.. ధాన్యం, సంపద, ఉన్నత స్థానం లభిస్తాయని నమ్మకం. యజ్ఞయాగాలు, పుణ్యక్షేత్ర దర్శనాల ఫలం కన్నా ఎన్నో రెట్ల అధిక పుణ్యం వస్తుందట.