News March 29, 2024

మార్చి 29: చరిత్రలో ఈరోజు

image

1857: మొదటి స్వాతంత్ర్య పోరాటం. సిపాయిల తిరుగుబాటు
1953: స్వాతంత్ర్య సమరయోధుడు జమలాపురం కేశవరావు కన్నుమూత
1952: తెలుగు రచయిత దివంగత కేఎన్‌వై పతంజలి జననం
1932: కొప్పారపు వేంకట సుబ్బరాయ కవి మరణం
1982: టీడీపీని స్థాపించిన దివంగత నటుడు ఎన్టీఆర్
1997: రచయిత్రి పుపుల్ జయకర్ మరణం
2016: నిర్మాత జయకృష్ణ మరణం
☞ నేడు గుడ్ ఫ్రైడే

Similar News

News October 15, 2025

పప్పులో కాలేసిన ఇన్వెస్టర్లు.. LG అనుకొని!

image

దక్షిణ కొరియాకు చెందిన ఎలక్ట్రానిక్స్‌ దిగ్గజం ‘LG ఎలక్ట్రానిక్స్‌’ స్టాక్‌మార్కెట్‌లో అరంగేట్రం చేసిన విషయం తెలిసిందే. ఈక్రమంలో ఇన్వెస్టర్లు షేర్లు కొనేందుకు ఎగబడ్డారు. అయితే చాలామంది సరైన కంపెనీని సెర్చ్ చేయకుండా పప్పులో కాలేశారు. LG ఎలక్ట్రానిక్స్‌కి బదులు పొరపాటున LG బాలకృష్ణన్ & బ్రదర్స్ లిమిటెడ్ షేర్లు కొనేశారు. దీంతో ఈ కంపెనీ షేర్లు ఒక్కసారిగా 20% పెరిగిపోయినట్లు ట్రేడ్ వర్గాలు తెలిపాయి.

News October 15, 2025

రేపు ఏపీలో పర్యటిస్తున్నా: మోదీ

image

గురువారం ఏపీలో పర్యటించనున్నట్లు ప్రధాని మోదీ ట్వీట్ చేశారు. ముందుగా శ్రీశైలంలోని భ్రమరాంబ మల్లికార్జునస్వామి ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించనున్నట్లు తెలిపారు. అనంతరం కర్నూలులో రూ.13,400 కోట్ల విలువైన అభివృద్ధి, శంకుస్థాపన కార్యక్రమాల్లో పాల్గొంటానని పేర్కొన్నారు. అంతకుముందు అంతర్జాతీయ యోగా దినోత్సవంలో పాల్గొనేందుకు ప్రధాని ఏపీలో పర్యటించిన సంగతి తెలిసిందే.

News October 15, 2025

ఇతిహాసాలు క్విజ్ – 36 సమాధానాలు

image

1. దశరథుడి తల్లి ఇందుమతి.
2. పాండవులు ఒక సంవత్సరం అజ్ఞాతవాసంలో ఉంటారు.
3. విష్ణువు ధనస్సు పేరు ‘సారంగం’.
4. తెలంగాణలోని భద్రాచలం ఆలయం గోదావరి నది ఒడ్డున ఉంది.
5. శుక అంటే చిలుక అని అర్థం.
<<-se>>#Ithihasaluquiz<<>>