News March 29, 2025

మార్చి 29: చరిత్రలో ఈరోజు

image

1932: కవి కొప్పరపు వేంకట సుబ్బరాయ మరణం
1950: నటుడు ప్రసాద్ బాబు జననం
1952: తెలుగు రచయిత కె.ఎన్‌.వై.పతంజలి జననం
1953: స్వాతంత్ర్య సమరయోధుడు జమలాపురం కేశవరావు మరణం
1982: నందమూరి తారక రామారావు తెలుగుదేశం పార్టీని స్థాపించారు
2016: సినీ నిర్మాత కాకిత జయకృష్ణ మరణం

Similar News

News November 17, 2025

హిందువులపై దాడులు బాధాకరం: షేక్ హసీనా

image

బంగ్లాదేశ్‌లో యూనస్‌ నేతృత్వంలోని తాత్కాలిక ప్రభుత్వం మైనార్టీలు, ముఖ్యంగా హిందువులపై దాడులను ప్రోత్సహిస్తోందని మాజీ PM షేక్ హసీనా మండిపడ్డారు. దీంతో వారంతా పారిపోవాల్సి వస్తోందన్నారు. దేశంలో హింస పెరిగిపోయిందని, ప్రజాస్వామ్యం, లౌకిక నిర్మాణం క్షీణిస్తోందని ఆవేదన వ్యక్తం చేశారు. యువత ఆందోళనలతో హసీనా గతేడాది ఆగస్టు 5 నుంచి భారత్‌లో ఆశ్రయం పొందుతోన్న విషయం తెలిసిందే.

News November 17, 2025

MANITలో ఉద్యోగాలు.. అప్లై చేశారా?

image

మౌలానా అజాద్ నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ(MANIT)లో 15 అసిస్టెంట్ ప్రొఫెసర్ పోస్టులకు అప్లై చేయడానికి ఇవాళే ఆఖరు తేదీ. అర్హతగల అభ్యర్థులు అప్లై చేసుకోవచ్చు. దరఖాస్తు హార్డ్ కాపీని ఈ నెల 27వరకు స్పీడ్ పోస్ట్ ద్వారా పంపాలి. ME, M.Tech, M.Arch, మాస్టర్ ఆఫ్ డిజైన్‌తో పాటు సంబంధిత విభాగంలో PhD పూర్తి చేసి ఉండాలి. దరఖాస్తు ఫీజు రూ.1500. వెబ్‌సైట్: https://www.manit.ac.in

News November 17, 2025

రవితేజ సినిమాలో సమంత?

image

రవితేజ, డైరెక్టర్ శివ నిర్వాణ కాంబోలో ఓ సినిమా రాబోతున్నట్లు సినీ వర్గాలు పేర్కొన్నాయి. ఇందులో సమంత హీరోయిన్‌గా నటించే ఛాన్సుందని తెలిపాయి. గతంలో శివ దర్శకత్వంలో మజిలీ, ఖుషి సినిమాల్లో సామ్ నటించారు. దీంతో మరోసారి ఆమెను దర్శకుడు సంప్రదించినట్లు సమాచారం. దీనిపై మూవీ టీమ్ నుంచి ప్రకటన రావాల్సి ఉంది. ప్రస్తుతం సమంత ‘మా ఇంటి బంగారం’ మూవీతో, రవితేజ ‘భర్త మహాశయులకు విజ్ఞప్తి’ సినిమాతో బిజీగా ఉన్నారు.