News March 6, 2025

మార్చి 6: చరిత్రలో ఈరోజు

image

1913: సినీ నటుడు కస్తూరి శివరావు జననం
1917: సంగీత దర్శకుడు పెండ్యాల నాగేశ్వరరావు జననం
1919: సాహితీవేత్త గడియారం రామకృష్ణ శర్మ జననం
1933: సినీ నటి కృష్ణకుమారి జననం
1984: హీరో శర్వానంద్ జననం
1995: స్వాతంత్ర సమరయోధుడు మోటూరి సత్యనారాయణ మరణం
1997: హీరోయిన్ జాన్వీ కపూర్ జననం

Similar News

News March 6, 2025

ఘోర ప్రమాదాలు.. 10 మంది మృతి

image

AP వ్యాప్తంగా నిన్న రాత్రి నుంచి జరిగిన 4 వేర్వేరు రోడ్డు ప్రమాదాల్లో 10 మంది మృతి చెందారు. HYD నుంచి కాకినాడ వెళ్తున్న ట్రావెల్స్ బస్సు ఏలూరు(మ) సోమవరప్పాడులో లారీని ఢీకొని ముగ్గురు చనిపోయారు. చిత్తూరు ఇరువారం జంక్షన్ వద్ద బైకును కారు ఢీకొట్టడంతో ఇద్దరు, విశాఖ కంచరపాలెంలో చెట్టును బైక్ ఢీకొట్టి ఇద్దరు, నిన్న రాత్రి గువ్వలచెరువు ఘాట్‌లో కారును తప్పించబోయి లారీ లోయలో పడి ముగ్గురు మృతి చెందారు.

News March 6, 2025

రాహుల్‌పై కోర్టు ఆగ్రహం.. జరిమానా ఎంతంటే?

image

లోక్‌సభ ప్రతిపక్షనేత రాహుల్‌గాంధీకి ఉత్తరప్రదేశ్‌లోని లక్నో‌కోర్టు రూ.200 జరిమానా విధించింది. సావర్కర్‌పై వివాదాస్పద వ్యాఖ్యల కేసులో బుధవారం విచారణకు హాజరుకావాల్సి ఉంది. అయితే వేరే కార్యక్రమాలు ఉన్నందున రాలేరని రాహుల్ తరపు న్యాయవాది తెలిపారు. దీంతో కోర్టు ఆగ్రహాం వ్యక్తం చేసింది. ఏప్రిల్ 14న తప్పనిసరిగా హాజరుకావాలని లేనిచో చట్టపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరికలు జారీచేసింది.

News March 6, 2025

Stock Markets: అప్రమత్తంగా ఇన్వెస్టర్లు..

image

దేశీయ స్టాక్‌మార్కెట్లు ఫ్లాటుగా చలిస్తున్నాయి. నిఫ్టీ 22,271 (-62), సెన్సెక్స్ 73,502 (-231) వద్ద ట్రేడవుతున్నాయి. ఆసియా మార్కెట్ల నుంచి మిశ్రమ సంకేతాలు అందడంతో ఇన్వెస్టర్లు ఆచితూచి వ్యవహరిస్తున్నారు. US జాబ్‌డేటా, వడ్డీరేట్ల తగ్గింపు ప్రకటన కోసం వేచి చూస్తున్నారు. O&G, మీడియా, మెటల్, ఎనర్జీ, బ్యాంకు, రియాల్టి షేర్లు ఎగిశాయి. కన్జూమర్ డ్యురబుల్స్, ఫైనాన్స్, FMCG షేర్లు స్వల్పంగా ఎరుపెక్కాయి.

error: Content is protected !!