News January 28, 2025
ఓటీటీలోకి ‘మార్కో’.. స్ట్రీమింగ్ ఎప్పుడంటే?

ఎలాంటి అంచనాలు లేకుండా విడుదలై మలయాళంలో సంచలన విజయం సాధించిన ‘మార్కో’ ఓటీటీ హక్కులను సోనీ లివ్ దక్కించుకుంది. ఫిబ్రవరి 27 లేదా మార్చి 10వ తేదీ నుంచి స్ట్రీమింగ్ చేయనున్నట్లు HT వెల్లడించింది. హనీఫ్ అదేనీ డైరెక్షన్లో ఉన్ని ముకుందన్ నటించిన ఈ చిత్రం డిసెంబర్ 20న విడుదలై రూ.110 కోట్లకు పైగా కలెక్షన్లను సాధించింది. మలయాళ ఇండస్ట్రీలోనే మోస్ట్ వయలెంట్ యాక్షన్ థ్రిల్లర్ మూవీగా నిలిచింది.
Similar News
News December 27, 2025
మాంజా ఎందుకంత డేంజర్? దేనితో తయారు చేస్తారు?

కైట్స్ పోటీల్లో ప్రత్యర్థి పతంగి దారాన్ని కట్ చేయడానికి చైనా మాంజాను షార్ప్‌గా తయారు చేస్తారు. కాటన్ లేదా సింథటిక్ దారానికి కృత్రిమ జిగురు, రంగులు, గ్లాస్ పౌడర్, మెటల్ పౌడర్ కలిపిన పేస్ట్‌ను పూస్తారు. దీన్ని ఎండలో ఆరబెట్టడం వల్ల దారం షార్ప్‌గా మారుతుంది. ఇది మనుషులు, పక్షులకు తీవ్ర ముప్పు తెస్తోంది. అందుకే చాలా ప్రాంతాల్లో దీన్ని బ్యాన్ చేశారు.
News December 27, 2025
ఉపవాసంలో ఉపశమనం కోసం..

ఉపవాస సమయంలో అలసట రాకుండా ఉండాలంటే సగ్గుబియ్యం, పన్నీర్ వంటి ఆహారాలు తీసుకోవడం ఉత్తమం. తాజా పండ్లు, డ్రై ఫ్రూట్స్ సహజ సిద్ధమైన శక్తిని ఇస్తాయి. శరీరంలో నీటి శాతం తగ్గకుండా పాలు, పెరుగు, కొబ్బరి నీళ్లు తీసుకోవడం చాలా అవసరం. తక్కువ ఉప్పు, తక్కువ నూనెతో చేసిన వంటకాలు ఆరోగ్యానికి మంచివి. ఇటువంటి మితమైన, పోషకాలున్న ఆహారం తీసుకోవడం వల్ల శక్తి కోల్పోకుండా ఉపవాసాన్ని విజయవంతంగా పూర్తి చేయవచ్చు.
News December 27, 2025
RBIలో 93 పోస్టులు.. అప్లై చేశారా?

ఆర్బీఐలో ఉద్యోగాలు చేయాలనుకునే ఐటీ, రిస్క్ మేనేజ్మెంట్ నిపుణులకు గుడ్ న్యూస్. <


